IPL 2023: ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా 11వ సారి సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్

ఐపీఎల్ సీజన్ తన తొలి మ్యాచ్‌లో ఓడిపోవటం ముంబై ఇండియన్స్ జట్టుకు ఆనవాయితీగా మారింది. 2013 నుంచి ప్రతీయేటా ఈ పరంపర కొనసాగుతోంది. తాజాగా ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ లోనూ ఓడిపోయి.. ఐపీఎల్ సీజన్‌‌లలో వరుసగా 11వ సారి తన తొలి మ్యాచ్‌ను ఓడిపోయిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డుకెక్కింది.

IPL 2023: ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా 11వ సారి సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్

Mumbai Indians

IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ గత నెల 31న అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో వరుసగా 11 సీజన్‌లలో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ ఓడిపోయిన జట్టుగా నిలిచింది. 2013 నుంచి 2023 వరకు జరిగిన ఐపీఎల్ సీజన్‌లలో తొలి మ్యాచ్ ఓడిపోవటం రోహిత్ సేనకు ఆనవాయితీగా వస్తుండటం గమనార్హం. అయితే, మొదటి మ్యాచ్ ఓడిపోయినప్పటికీ పలుసార్లు ముంబై ఇండియన్స్ జట్టు టైటిల్స్ గెలుచుకుంది.

IPL 2023 RCBvsMI : దంచికొట్టిన కోహ్లీ, డుప్లెసిస్..ముంబైపై బెంగళూరు ఘన విజయం

ముంబై ఇండియన్స్‌కు మొదటి నుంచి జట్టులో బలమైన ఆటగాళ్లు ఉన్నారు. అయినా గత పదకొండు సీజన్ లలో ఆ జట్టు మొదటి మ్యాచ్ ఓడిపోతూవస్తుంది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో రాయల్స్ ఛాలెంజర్స్ పై విజయం సాధించి ఆనవాయితీకి ముంబై జట్టు స్వస్తి చెబుతుందని జట్టు అభిమానులు భావించినప్పటికీ 11వ సీజన్ లోనూ తొలి మ్యాచ్ ఓడిపోవటం గమనార్హం. తొలి మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టు పలు సార్లు ఐపీఎల్ విజేగా నిలిచింది. 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లోజరిగిన ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది.

IPL 2023, SRH vs RR: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి.. Live Updates

ముంబై ఇండియన్స్ వరుసగా ఐపీఎల్ సీజన్‌లలో తొలి మ్యాచ్‌ ఇలా ..

– 2013 ఐపీఎల్ సీజన్‌లో ముంబై జట్టు తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. ఆర్సీబీ 2 పరుగుల తేడాతో ముంబై జట్టుపై విజయం సాధించింది.

– 2014 ఐపీఎల్ సీజన్‌లో ముంబై జట్టు తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తో తలపడింది. 41 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది.

– 2015 ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడింది. మూడు వికెట్ల తేడాతో కేకేఆర్ జట్టు విజయం సాధించింది.

– 2016 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్ ఫూణె జట్టుతో తలపడింది. పూణె తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

– 2017 ఐపీఎల్ సీజన్ లోనూ తన తొలిమ్యాచ్ పూణె జట్టుతో తలపడిన ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. 7 వికెట్ల తేడాతో పుణె జట్టు విజయం సాధించింది.

– 2018 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయింది. సీఎస్‌కే ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది.

– 2019 ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తన తొలి మ్యాచ్ ఆడి ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. డీసీ జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.

– 2020 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తన తొలి మ్యాచ్ ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయింది. సీఎస్‌కే జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

– 2021 ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్ ఆడింది. ఆర్సీబీ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

– 2022 ఐపీఎల్ సీజన్ లో తన తొలి మ్యాచ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ ఆడింది. డీసీ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

– 2023 ఐపీఎల్ సీజన్ లో తన తొలి మ్యాచ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడింది. కానీ, ఆర్సీబీ 8వికెట్ల తేడాతో విజయంసాధించింది.