IPL 2023 RCBvsMI : దంచికొట్టిన కోహ్లీ, డుప్లెసిస్..ముంబైపై బెంగళూరు ఘన విజయం

IPL 2023 RCBvsMI : 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టులో.. ఓపెనర్లు రాణించారు. ఆది నుంచి దూకుడుగా ఆడారు.

IPL 2023 RCBvsMI : దంచికొట్టిన కోహ్లీ, డుప్లెసిస్..ముంబైపై బెంగళూరు ఘన విజయం

IPL 2023 RCBvsMI : ఐపీఎల్ 2023 లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబైపై బెంగళూరు ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో బెంగళూరు విక్టరీ కొట్టింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టులో.. ఓపెనర్లు రాణించారు. ఆది నుంచి దూకుడుగా ఆడారు.

విరాట్ కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కోహ్లీ 49 బంతుల్లో 82 పరగులతో అజేయంగా నిలిచాడు. డూప్లెసిస్ 43 బంతుల్లో 73 పరుగులు చేశాడు. వీరిద్దరూ ముంబై బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. తొలి వికెట్ కు 148 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో ఆర్బీసీ 16.2 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి టార్గెట్ ను చేజ్ చేసింది.

Also Read..IPL 2023: జియో సినిమా యాప్‌ సరికొత్త రికార్డు.. ఒక్క రోజులోనే కోట్లాది డౌన్‌లోడ్‌లు

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. తెలుగుతేజం తిలక్ వర్మ 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. 172 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు 16.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి గెలుపొందింది.

కోహ్లీ 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అటు కెప్టెన్ డుప్లెసిస్ సైతం విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. డుప్లెసిస్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులతో 73 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. తక్కువ స్కోర్ కే పరిమితమవుతుందని భావించారు. అయితే, అనూహ్యరీతిలో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. అందుకు కారణం తెలుగుతేజం తిలక్ వర్మ అద్భుత పోరాటమే. మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు దిగిన తిలక్ వర్మ దూకుడుగా ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 46 బంతుల్లో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తిలక్ వర్మ స్కోరులో 9 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి హర్షల్ పటేల్ బౌలింగ్ లో తిలక్ వర్మ హెలికాప్టర్ షాట్ తో సిక్స్ కొట్టిన విధానం హైలైట్.

Also Read..IPL 2023 : ఏ రోజు ఏ జట్టు మ్యాచ్ ఎవరితో, ఎక్కడ జరుగుతుంది.. IPL మ్యాచ్‌ల ఫుల్ డీటెయిల్స్..

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తిలక్ వర్మ, నేహాల్ వధేరా (13 బంతుల్లో 21 రన్స్) కీలక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. వధేరా ఔట్ అయినా తిలక్ వర్మ పోరాటం ఆపలేదు. తిలక్ వర్మ హైదరాబాద్ రంజీ ఆటగాడు. ఐపీఎల్ లో గత సీజన్ లోనూ ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.