IPL 2023: జియో సినిమా యాప్ సరికొత్త రికార్డు.. ఒక్క రోజులోనే కోట్లాది డౌన్లోడ్లు
జియో ఇచ్చిన అద్భుతమైన అవకాశంతో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో జియో సినిమా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో ఒకేరోజు ఇండియాలో అత్యధికంగా డౌన్లోడ్లను నమోదుచేసిన యాప్‌గా జియో సినిమా యాప్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

JIO CINIMA app
IPL 2023: ఐపీఎల్ 2023 టోర్నీ హట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగింది. తొలిరోజు మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు భారీగా తిలకించారు. గతంలో ఐపీఎల్ చూడాలంటే డిస్నీప్లస్ హాట్ స్టార్ యాప్‌లో నెల, సంవత్సరం సబ్ స్క్రిప్షన్ తీసుకొని చూడాల్సి వచ్చేంది. అయితే, ఈ ఏడాది ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను ముఖేశ్ అంబానీ సంస్థ జియో దక్కించుకుంది. అయితే, ఎలాంటి రుసుము లేకుండానే ఫ్రీగా జియో సినిమా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా లైవ్ మ్యాచ్‌ను చూడొచ్చు.
జియో ఇచ్చిన అద్భుతమైన అవకాశంతో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో జియో సినిమా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఉచితంగా కావడంతో.. శుక్రవారం ఒక్క రోజే2.5 కోట్ల మంది జియో సినిమా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లు Viacom18 ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఒకేరోజు ఇండియాలోనే అత్యధికంగా డౌన్లోడ్లను నమోదుచేసిన యాప్‌గా జియో సినిమా యాప్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
IPL 2023, GT vs CSK: చెన్నైపై గుజరాత్ ఘన విజయం
16వ ఐపీఎల్ సీజన్ శుక్రవారం ప్రారంభం కాగా.. తొలి మ్యాచ్ సీఎస్కే, జీటీ మధ్య జరిగింది. తొలి మ్యాచ్ కోసం 6కోట్ల మంది ప్రత్యేక వీక్షకులు ట్యూన్ – ఇన్ చేశారు. తొలిరోజు మ్యాచ్ ను పూర్తిస్థాయిలో జియో సినిమా యాప్‌లో 1.6కోట్లకుపైగా వీక్షకులతో గరిష్ట స్థాయిలో నిలిచింది. దీంతో జియో సినిమా యాప్‌తో పాటు, ఫ్లాట్ ఫారమ్‌లో అత్యధికంగా వీక్షించబడిన ఈవెంట్లలో ఈ మ్యాచ్ ఒకటని జియో పేర్కొంది. మొదటి రోజు మొత్తం మ్యాచ్ వీక్షణలు 50 కోట్లకు చేరుకున్నారు. రిలయన్స్ యాజమాన్యంలోని ప్లాట్ ఫారమ్ మెరుగైన మ్యాచ్ వీక్షణ అనుభవం కోసం 4కే స్ట్రీమింగ్, బహుళ కెమెరా యాంగిల్స్ వంటి యాప్ ఫీచర్లను ప్రకటించింది.