IPL 2023, GT vs CSK: చెన్నైపై గుజరాత్ ఘన విజయం

చెన్నై నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి, మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేధించింది గుజరాత్.

IPL 2023, GT vs CSK: చెన్నైపై గుజరాత్ ఘన విజయం

IPL 2023 GT vs CSK

IPL 2023 Opening Ceremony, GT vs CSK: ఐపీఎల్ 16లో గుజరాత్ టైటాన్స్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి, మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేధించింది గుజరాత్. 19.2ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 రన్స్ చేసింది. గుజరాత్ బ్యాటర్లలో గిల్ 63, విజయ్ శంకర్ 27, సాహా 25, సుదర్శన్ 22 పరుగులతో రాణించారు. చెన్నై బౌలర్లలో హంగార్గేకర్ మూడు వికెట్లు తీశాడు. జడేజా, తుషార్ దేశ్ పాండే తలో వికెట్ పడగొట్టారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023(IPL 2023) సీజన్ 16లో మొట్టమొదటి మ్యాచ్ గుజరాత్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు గుజరాత్ కెప్టెన్ పాండ్యా.

ఇక, ఐపీఎల్-2023 ప్రారంభ వేడుక కోసం పలువురు సెలబ్రిటీలు వచ్చారు. హీరోయిన్లు తమన్నా, రష్మిక మందన ప్రత్యేక డ్యాన్స్ ప్రదర్శనలు ఇచ్చారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 31 Mar 2023 11:47 PM (IST)

    అంబరాన్నంటే ఆనందం

    ఐపీఎల్ టోర్నీలో గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టడంతో ఆ జట్టు ఆటగాళ్లు అంబరాన్నంటే ఆనందం వ్యక్తం చేశారు. బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుపై గెలవడం, ఐపీఎల్-2022లో తాము గెలిచిన క్షణాలు గుర్తుకురావడంతో సంబరాలు చేసుకున్నారు. గత ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ గెలుపొందిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ రనపర్ గా నిలిచింది. మళ్లీ ఇప్పుడు మొదటి మ్యాచులోనూ గుజరాత్ టైటాన్స్ గెలవడంతో ఈ సారి కూడా కప్పు వారిదేనని ఆ జట్టు అభిమానులు అంటున్నారు.

  • 31 Mar 2023 11:47 PM (IST)

    చెన్నైపై గుజరాత్ గ్రాండ్ విక్టరీ

    ఐపీఎల్ 16లో గుజరాత్ టైటాన్స్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి, మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేధించింది గుజరాత్. 19.2ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 రన్స్ చేసింది. గుజరాత్ బ్యాటర్లలో గిల్ 63, విజయ్ శంకర్ 27, సాహా 25, సుదర్శన్ 22 పరుగులతో రాణించారు. చెన్నై బౌలర్లలో హంగార్గేకర్ మూడు వికెట్లు తీశాడు. జడేజా, తుషార్ దేశ్ పాండే తలో వికెట్ పడగొట్టారు.

  • 31 Mar 2023 09:32 PM (IST)

    గుజరాత్ టైటాన్స్ లక్ష్యం 179 పరుగులు

    గుజరాత్ టైటాన్స్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ 179 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ధాటిగా ఆడి 92 పరుగులు చేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో మోయిల్ అలీ 23, శివం దుబే 19 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్, జోసెఫ్ రెండేసి వికెట్లు తీశారు. జాషువా లిటిల్ ఒక వికెట్ పడగొట్టాడు.

  • 31 Mar 2023 09:23 PM (IST)

    7 వికెట్లు కోల్పోయిన చెన్నై

    చెన్నై సూపర్ కింగ్స్ ఏడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో ధోనీ (1), మిచెల్ శాంట్నర్ (1) ఉన్నారు.

  • 31 Mar 2023 09:16 PM (IST)

    5 వికెట్లు కోల్పోయిన చెన్నై.. రుతురాజ్ సెంచరీ మిస్..

    చెన్నై 5 వికెట్లు కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ మిస్ అయ్యాడు. ఐపీఎల్-2023 సీజన్ తొలి మ్యాచులోనే చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ బాదుతాడని అందరూ భావించారు. జట్టులోని మిగతా బ్యాటర్లు అందరూ విఫలమైనప్పటికీ ఒక్కడే క్రీజులో నిలబడి ధాటిగా ఆడాడు. అయితే, 49 బంతుల్లో 92 పరుగులు చేసి జోసెఫ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. చెన్నై స్కోరు 157/6 (18 ఓవర్లకు)గా ఉంది.

  • 31 Mar 2023 08:47 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్

    చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. జాషువా లిటిల్ బౌలింగ్ లో అంబటి రాయుడు (12) ఔటయ్యాడు. చెన్నై స్కోరు 121/4 (13 ఓవర్లకు)గా ఉంది. 

  • 31 Mar 2023 08:25 PM (IST)

    5 సిక్సులు, 3 ఫోర్లు.. రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ

    రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ బాదాడు. 23 బంతుల్లోనే 5 సిక్సులు, 3 ఫోర్లు సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో అతడితో పాటు అంబటి రాయుడు (1) ఉన్నాడు.

  • 31 Mar 2023 08:19 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్

    చెన్నై సూపర్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. బెన్ స్టోక్స్ 7 పరుగులకే రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

  • 31 Mar 2023 08:04 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్

    చెన్నై సూపర్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. మోయిన్ అలీ 16 బంతుల్లో 23 పరుగులు బాది రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. స్కోరు 51/2 (6 ఓవర్లకు)గా ఉంది.  

  • 31 Mar 2023 07:54 PM (IST)

    చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 4 ఓవర్లకు 29/1

    చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ దూకుడుగా ఆడుతున్నాడు. 13 బంతుల్లో ఒక సిక్సు, 3 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేశాడు. అతడితో పాటు క్రీజులో మోయిన్ అలీ (4) ఉన్నాడు. జట్టు స్కోరు 29/1 (4 ఓవర్లు)గా ఉంది.

  • 31 Mar 2023 07:48 PM (IST)

    తొలి వికెట్ డౌన్

    చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. డెవాన్ కాన్వే 1 పరుగుకే ఔటయ్యాడు. 2.2 ఓవర్ల వద్ద షమీ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

  • 31 Mar 2023 07:42 PM (IST)

    2 ఓవర్లకు 13 పరుగులు

    చెన్నై సూపర్ కింగ్స్ రెండో ఓవర్ నాటికి 13 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 11, కాన్వే 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

  • 31 Mar 2023 07:35 PM (IST)

    క్రీజులోకి గైక్వాడ్, కాన్వే

    చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులోకి రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే వచ్చారు. తొలి ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2 పరుగులు చేసింది.

  • 31 Mar 2023 07:28 PM (IST)

    ధోనీ సేన

    చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, మోమయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, దుబే, చాహర్, శాంట్నర్, హంగర్గేకర్

  • 31 Mar 2023 07:26 PM (IST)

    హార్డిక్ పాండ్యా సేన

    గుజరాత్ జట్టు: శుభ్ మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, హార్డిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, రాహుల్ తెవటియా, రషీద్ ఖాన్, షమీ, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్

  • 31 Mar 2023 07:12 PM (IST)

    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ కెప్టెన్ పాండ్యా

    ఐపీఎల్-2023లో తొలి మ్యాచులో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ పాండ్యా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ మ్యాచులు దేశ వ్యాప్తంగా 12 పట్టణాల్లో జరుగుతాయి. 10 టీమ్స్ మధ్య 70 లీగ్ మ్యాచులు ఉంటాయి. ఇవాళ తొలి లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్-2022లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ట్రోఫీని గెలుపొందిన విషయం విదితమే.

     

  • 31 Mar 2023 07:02 PM (IST)

    ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుక ముగింపు

    ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుక ముగిసింది. ఇక మ్యాచ్ మిగిలింది.

  • 31 Mar 2023 06:53 PM (IST)

    ప్రత్యేక వాహనాలపై ధోనీ, హార్దిక్ పాండ్యా

    ప్రత్యేక వాహనాలపై ముందుకు కదిలి వేదికపైకి ధోనీ, హార్దిక్ పాండ్యా వచ్చారు. చెన్నై జట్టుకు ధోనీ, గుజరాత్ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్నారు.

  • 31 Mar 2023 06:50 PM (IST)

    "రారా సామీ.. నా సామీ" పాటకు రష్మిక మంధాన

    పుష్ప సినిమాలోని "రారా సామీ.. నా సామీ" పాటకు రష్మిక మంధాన డ్యాన్స్ చేసింది. మరికొన్ని పాటల మ్యూజిక్ కి కూడా డ్యాన్స్ చేసి అదుర్స్ అనిపించింది.

  • 31 Mar 2023 06:49 PM (IST)

    "ఊ అంటావా మావా" పాటకు తమన్నా డ్యాన్స్

    పుష్ప సినిమాలోని ఊ అంటావా మావా పాట సహా పలు పాటలకు తమన్నా డ్యాన్స్ చేసి అలరించింది. ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.

  • 31 Mar 2023 06:27 PM (IST)

    వెలుగుల్లో కప్

  • 31 Mar 2023 06:23 PM (IST)

    బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందన

  • 31 Mar 2023 06:17 PM (IST)

    'ఏ వతన్' పాటతో వేడుక ప్రారంభం

    సింగర్ అర్జిత్ సింగ్ ప్రదర్శనతో ఐపీఎల్-2023 (IPL 2023) వేడుక ప్రారంభమైంది. ఆలియా భట్ నటించిన రాజీ సినిమాలోని 'ఏ వతన్' పాటను సింగర్ అర్జిత్ సింగ్ పాడారు. అనంతరం ఆల్ టైమ్ హిట్ సాంగ్ 'చన్నా మేరేయా' ఆలపించారు. పియానో వాయిస్తూ పాడపాడుతూ అభిమానులను అలరించారు.