IPL 2023, MI Vs RR: య‌శ‌స్వి జైస్వాల్ సెంచ‌రీ వృథా.. దంచికొట్టిన సూర్య‌కుమార్, టిమ్ డేవిడ్‌.. రాజ‌స్థాన్‌పై ముంబై గెలుపు

IPL 2023, MI Vs RR: ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. రాజ‌స్థాన్ నిర్దేశించిన ల‌క్ష్యాన్నిముంబై 19.3 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

IPL 2023, MI Vs RR: య‌శ‌స్వి జైస్వాల్ సెంచ‌రీ వృథా.. దంచికొట్టిన సూర్య‌కుమార్, టిమ్ డేవిడ్‌.. రాజ‌స్థాన్‌పై ముంబై గెలుపు

MI Win

IPL 2023, MI Vs RR: ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. రాజ‌స్థాన్ నిర్దేశించిన ల‌క్ష్యాన్నిముంబై 19.3 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబై బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ (55; 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో అల‌రించ‌గా కామెరూన్ గ్రీన్‌(44; 26 బంతుల్లో 4 పోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించాడు. ఆఖ‌ర్లో టిమ్ డేవిడ్ (45 నాటౌట్‌; 14 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) దంచికొట్ట‌డంతో ముంబై గెలిచింది. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ రెండు వికెట్లు తీయ‌గా, సందీప్ శ‌ర్మ‌, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

IPL 2023, MI Vs RR: రాజ‌స్థాన్‌పై ముంబై విజ‌యం

అంత‌క‌ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజ‌స్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (124; 62 16 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) ముంబై బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఫోర్లు, సిక్స‌ర్లు బాదుతూ 53 బంతుల్లోనే శ‌త‌కాన్ని అందుకున్నాడు. ఓ వైపు వికెట్లు ప‌డుతున్నా మ‌రోవైపు జైస్వాల్ దూకుడు కొన‌సాగించ‌డంతో రాజ‌స్థాన్ భారీ స్కోరు చేసింది. మిగిలిన వారిలో బ‌ట్ల‌ర్ 18, శాంస‌న్ 14, హోల్డ‌ర్ 11 ప‌రుగులు చేశారు. ముంబై బౌల‌ర్ల‌లో అర్షద్ ఖాన్ మూడు వికెట్లు తీయ‌గా, పీయూష్ చావ్లా రెండు, జోఫ్రా ఆర్చర్, రిలే మెరెడిత్ లు ఒక్కొ వికెట్ తీశారు.

Rohit Sharma: రోహిత్ రెస్ట్ తీసుకో అన్న గ‌వాస్క‌ర్.. అన్ని మ్యాచ్‌లు ఆడ‌తాడ‌న్న ముంబై కోచ్ బౌచ‌ర్‌..!