Rohit Sharma Birthday: హైదరాబాద్ ఫ్యాన్సా మజాకానా.. 60 అడుగుల రోహిత్ కటౌట్
Rohit Sharma Birthday:ఏప్రిల్ 30 హిట్‌మ్యాన్ పుట్టిన రోజు. నేడు(ఆదివారం) రోహిత్ 36వ పడిలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రోహిత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా హిట్‌మ్యాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే.. తాము అందరిలా కామని నిరూపించారు హైదరాబాద్ ఫ్యాన్స్

Rohit Sharma Birthday
Rohit Sharma Birthday: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేరు చెబితే చాలు అభిమానులు పులకరించిపోతారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni), పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ(Virat Kohli)లకు ఏ మాత్రం తగ్గని ఆదరణ హిట్‌మ్యాన్ సొంతం. వైట్ బాల్ క్రికెట్లో రోహిత్ కంటే గొప్పగా ఎవరూ ఆడలేరు ఏమో అన్నంతగా తనదైన ముద్ర వేశాడు. ఓ ఆటగాడు తన కెరీర్ మొత్తంలో వన్డే క్రికెట్లో ఒక్కసారి అయినా డబుల్ సెంచరీ చేయాలని కలలు కంటుంటే రోహిత్ మాత్రం మూడు సార్లు ద్విశతకాలు బాదేశాడు. ముఖ్యంగా శ్రీలంకపై వన్డేల్లో చేసిన 264 పరుగుల ఇన్నింగ్స్‌ను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు.
వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఒక్క సెంచరీ సాధించడమే గొప్పగా భావిస్తుంటే హిట్‌మ్యాన్ మాత్రం 2019 వన్డే ప్రపంచప్ కప్‌లో ఏకంగా ఐదు శతకాలు బాదేశాడు. ఇలా ఓ ప్రపంచకప్ టోర్నీలో 5 సెంచరీలు చేసిన ఏకక ఆటగాడు రోహిత్ శర్మనే కావడం విశేషం. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఏకంగా ఐదు టైటిల్స్‌ను గెలిచాడు. ఇంకా ఎన్నో రికార్డులను హిట్‌మ్యాన్ నెలకొల్పాడు.
60 అడుగుల కటౌట్
ఏప్రిల్ 30 హిట్‌మ్యాన్ పుట్టిన రోజు. నేడు(ఆదివారం) రోహిత్ 36వ పడిలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రోహిత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా హిట్‌మ్యాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే.. తాము అందరిలా కామని నిరూపించారు హైదరాబాద్ ఫ్యాన్స్. రోహిత్ ఉన్న ప్రేమను ఘనంగా చాటారు. ఏకంగా 60 అడుగల రోహిత్ కటౌట్‌ను హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేశారు. బహుశా.. ఇప్పటి వరకు ఏ క్రికెటర్‌కు కూడా ఇంత పెద్ద కటౌట్ పెట్టలేదేమో.
Puttinaroju spesal ?
A 6️⃣0️⃣ feet cut-out of Hitman in Hyderabad ?
?: @mitelugufc #OneFamily #Hitman10 #HappyBirthdayRohit #MumbaiMeriJaan #MumbaiIndians @ImRo45 pic.twitter.com/B1DMcy6mrI
— Mumbai Indians (@mipaltan) April 30, 2023
రోహిత్ శర్మ పుట్టింది ముంబైలో అయినప్పటికి హైదరాబాద్‌తో కూడా అనుబంధం ఉంది. ఐపీఎల్ ఆరంభ సీజన్లలో రోహిత్ శర్మ హైదరాబాద్ ప్రాంఛైజీ డెక్కన్ ఛార్జర్స్ కు ఆడాడు. 2009లో డెక్కన్ ఛార్జర్స్ ఐపీఎల్ టైటిల్‌ను అందుకుంది. ఆ జట్టులో రోహిత్ కూడా ఉన్నాడు. ఆ సీజన్లో రోహిత్ ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకున్నాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 362 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 11 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ వికెట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌పైనే రోహిత్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు.
Rohit Sharma: ఐపీఎల్లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత