Naatu Naatu Song Promo : రామ్, భీమ్ ఆట – పాట.. తప్పదు రికార్డుల వేట..

19 సెకన్ల ప్రోమోలో తారక్ - చరణ్ క్లాస్ గెటప్‌లో ఊర నాటు స్టెప్పులతో సిల్వర్ స్క్రీన్‌ని షేక్ చెయ్యబోతున్నారని హింట్ ఇచ్చారు..

Naatu Naatu Song Promo : రామ్, భీమ్ ఆట – పాట.. తప్పదు రికార్డుల వేట..

Naatu Naatu Song Promo

Naatu Naatu Song Promo: తెలుగు తెరపై ఇద్దరు యంగ్ స్టార్ హీరోల క్రేజీ కాంబినేషన్.. విజువల్ వండర్‌గా వరల్డ్ వైడ్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. గోండు బెబ్బులి కొమరం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌‌లు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం)..

RRR Glimpse : గ్లింప్స్ గూస్ బంప్స్..

45 సెకన్ల గ్లింప్స్‌తో జక్కన్న మరోసారి ఆడియన్స్‌ను అబ్బుర పరిచారు. అసలు కను రెప్పపాటులో రాకెట్ స్పీడ్‌తో కట్ చేసిన షాట్స్ చూస్తే మతి పోతుంది. మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద ‘ఆర్ఆర్ఆర్’ రూపంలో మ్యాజిక్ చెయ్యబోతున్నారనిపించింది. విజువల్స్, ఆర్ఆర్ గూస్ బంప్స్ అసలు.

Jr NTR : సీనియర్ ఫ్యాన్‌తో జూనియర్..

ఇంతకుముందు రామ్ – భీమ్‌ల మధ్య స్నేహబంధాన్ని తెలియజేస్తూ ‘దోస్తీ’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా స్వరవాణి కీరవాణి కంపోజ్ చేసిన ‘నాటు నాటు’ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. 19 సెకన్ల ప్రోమోలో తారక్ – చరణ్ క్లాస్ గెటప్‌లో ఊర నాటు స్టెప్పులతో సిల్వర్ స్క్రీన్‌ని షేక్ చెయ్యబోతున్నారని హింట్ ఇచ్చారు. నవంబర్ 10వ తేది సాయంత్రం ‘నాటు నాటు’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చెయ్యనున్నారు. రామ్ – భీమ్ కలిసి డ్యాన్స్ చేశారంటే ఇక ఆ సాంగ్ సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చెయ్యడం పక్కా.