Naga Chaitanya : ఇదేం స్పీడు స్వామి..!

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య వరుసగా సినిమాలు లైనప్ చేస్తూ బిజీ అయిపోయారు..

Naga Chaitanya : ఇదేం స్పీడు స్వామి..!

Naga Chaitanya

Naga Chaitanya: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. వరుసగా సినిమాలు లైనప్ చేస్తూ బిజీ అయిపోయారు. ‘లవ్ స్టోరీ’ రిలీజ్‌కి రెడీగా ఉంది. వినాయక చవితి కానుకగా ఈనెల 10న విడుదల అని అనౌన్స్ చేసి, మళ్లీ పోస్ట్ పోన్ చేశారు.

Laabam: వినాయక చవితికి విజయ్ సేతుపతి “లాభం”.. ఫస్ట్ లుక్ వచ్చేసింది

‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘థ్యాంక్యూ’ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇంతలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఆమిర్ ఖాన్‌తో కలిసి ‘లాల్ సింగ్ చద్దా’ లో యాక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే తండ్రి నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోనున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ మూవీ కూడా స్టార్ట్ చేసేశాడు.

Bangarraju : ‘బంగార్రాజు’ స్టార్ట్ అయ్యాడు.. ఆనందంలో అక్కినేని అభిమానులు..

ఇప్పుడు మరో డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందించే దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి. లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎమోషన్స్ స్క్రీన్ మీద ఆయన డ్రైవ్ చేసే విధానం ఆకట్టుకుంటుంది. తన మార్క్ డైలాగ్స్‌తోనూ అలరిస్తారాయన. ‘అష్టా – చమ్మా’ నుంచి నాని ‘వి’ వరకు ఇంద్రగంటి సినిమాలకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది.

Mohana Krishna Indraganti

 

Chai – Sam : క్యూట్ కపుల్ కల నెరవేరింది..

చైతు ఇమేజ్‌కి తగ్గట్లు మంచి కథ రెడీ చేసి వినిపించగా.. ఓకే చెప్పారట. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించనున్నారు. చైతు – సమంత నటించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘మజిలీ’ తర్వాత ఈ బ్యానర్‌లో రెండవ సినిమా చెయ్యబోతున్నారు యువసామ్రాట్.

Majili