Chai – Sam : క్యూట్ కపుల్ కల నెరవేరింది..

‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తో సమంతకు బాలీవుడ్‌లో కూడా ఆఫర్లు వస్తున్నాయి.. చైతు, ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ మూవీతో హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు..

Chai – Sam : క్యూట్ కపుల్ కల నెరవేరింది..

Chai Sam

Chai – Sam: టాలీవుడ్ క్యూట్ కపుల్ యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య – టాలెంటెడ్ బ్యూటీ సమంత ప్రొఫెషనల్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ పర్సనల్ లైఫ్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. షూటింగ్స్ నుండి కాస్త గ్యాప్ దొరికితే చాలు.. నచ్చిన ప్లేసెస్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు.

చై, సామ్ ఆన్‌స్క్రీన్ ప్రేమకు పదకొండేళ్లు..

అలా, చై బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకోవడానికి గోవా వెళ్లిన ఈ లవ్లీ కపుల్.. అక్కడి ప్రదేశాలు, వాతావరణం బాగా నచ్చడంతో గోవా తీరంలో ఒక చక్కటి డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని అనుకున్నారట. ఇన్నాళ్లకు వీరి కల నెరవేరబోతుంది. ఇప్పటికే గోవాలో మంచి ప్లేస్ తీసుకున్నారు. స్థానికంగా పాపులర్ అయిన ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ నిర్మాణ పనులను కూడా ప్రారంభించినట్లు సమాచారం.

Naga Chaitanya : ఇన్‌స్టాలో యువసామ్రాట్ నాగ చైతన్య సెన్సేషన్..

‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తో సమంతకు బాలీవుడ్‌లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. చైతు, ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ మూవీతో హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో షూటింగ్స్ నిమిత్తం బాంబే వెళ్లినప్పుడు స్టే చెయ్యడానికి అక్కడ కూడా ఓ మంచి ఫ్లాట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారట చై – సామ్.

Love Story : వినాయక చవితికి.. చైతు, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’..

సినిమాల విషయానకొస్తే.. చైతు – సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ‘లవ్ స్టోరీ’ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘థ్యాంక్యూ’ సినిమా కూడా పూర్తి కావొచ్చింది. ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. సమంత, గుణశేఖర్ తెరకెక్కిస్తున్న హిస్టారికల్ ఫిలిం ‘శాకుంతలం’ లో నటిస్తోంది. ఇటీవలే తన పోర్షన్ షూట్ కంప్లీట్ చేసింది సామ్.

Shaakuntalam: సమంతతో గుణశేఖర్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’..