Naga Chaitanya : నెగెటివ్ రోల్‌లో నాగ చైతన్య..!

యువసామ్రాట్ నాగ చైతన్య - ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించబోయే సిరీస్‌లో నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు..

Naga Chaitanya : నెగెటివ్ రోల్‌లో నాగ చైతన్య..!

Naga Chaitanya

Naga Chaitanya: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. వరుసగా సినిమాలు లైనప్ చేస్తూ బిజీ అయిపోయారు. సెప్టెంబర్ 24న ‘లవ్ స్టోరీ’ భారీ అంచనాల మధ్య రిలీజ్‌ అవుతోంది. దాదాపు రెండేళ్ల తర్వాత ఓవర్సీస్‌లో 300లకు పైగా లొకేషన్స్‌లో రిలీజ్ అవుతున్న సినిమా ఇదే కావడం విశేషం.

Love Story Trailer : ‘చస్తే చద్దాం.. కానీ తేల్చుకుని చద్దాం’.. చైతు బెస్ట్ పెర్ఫార్మెన్స్..

‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘థ్యాంక్యూ’ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇంతలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఆమిర్ ఖాన్‌తో కలిసి ‘లాల్ సింగ్ చద్దా’ లో యాక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే తండ్రి నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోనున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ మూవీ కూడా స్టార్ట్ చేసేశాడు.

Prema Nagar : తాత సినిమాతో మనవడి మూవీకి లింక్ భలే కుదిరిందే..

తనకు, సమంతకు ‘మజిలీ’ వంటి మెమరబుల్ మూవీ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే మోహనకృష్ణ ఇంద్రగంటితోనూ సినిమా ఉందని అంటున్నారు. ఇంతలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు చైతు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో ఓ డిఫరెంట్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు నాగ చైతన్య. అమెజాన్ ప్రైమ్ కోసం చెయ్యబోయే ఈ సిరీ‌స్‌లో చై నెగటివ్ రోల్‌లో కనిపించనున్నాడు. తన క్యారెక్టర్‌ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసేశాడట చైతన్య..

Chiranjeevi : సాయి పల్లవిని మెగాస్టార్ మామూలుగా ఏడిపించలేదుగా..!