Prema Nagar : తాత సినిమాతో మనవడి మూవీకి లింక్ భలే కుదిరిందే..

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు నటించిన బ్లాక్‌బస్టర్ సినిమాతో ఈనెల 24 రిలీజ్ కానున్న నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ కి లింక్ భలే సింక్ అయ్యింది..

Prema Nagar : తాత సినిమాతో మనవడి మూవీకి లింక్ భలే కుదిరిందే..

Anr Naga Chaitanya

Updated On : September 14, 2021 / 11:05 AM IST

Prema Nagar: నటసామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు నటించిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ప్రేమనగర్’ తో ఆయన మనవడు, యువసామ్రాట్ నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’ ఒక విషయంలో అదిరిపోయే పోలిక కుదిరింది. అది అనుకోకుండా జరిగిందో, లేక కావాలనే ‘లవ్ స్టోరీ’ మేకర్స్ ఆ నిర్ణయం తీసుకున్నారో కానీ అక్కినేని తాతా మనవడి సినిమాల న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Love Story Trailer : ‘చస్తే చద్దాం.. కానీ తేల్చుకుని చద్దాం’.. చైతు బెస్ట్ పెర్ఫార్మెన్స్..

వివరాల్లోకి వెళ్తే.. ఏఎన్నాఆర్, వాణిశ్రీ జంటగా.. రామానాయుడు నిర్మాతగా.. కె.ఎస్. ప్రకాశ రావు (కె. రాఘవేంద్ర రావు తండ్రి) తెరక్కెకించిన సెన్సేషనల్ హిట్ ఫిలిం ‘ప్రేమనగర్’.. ఈ సినిమా 1971 సెప్టెంబర్ 24న విడుదలైంది.

Prema Nagar

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరీ’.. సోమవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చెయ్యగా.. చూసిన వారంతా పక్కా హిట్ అని చెప్పేస్తున్నారు.

Samantha : ‘లవ్ స్టోరీ’ ట్రైలర్‌పై సమంత రియాక్షన్.. డిఫరెన్స్ గమనించారా..?

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పలుమార్లు ‘లవ్ స్టోరీ’ విడుదల వాయిదా పడింది. వినాయక చవితి కానుకగా ఈనెల 10న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ కుదరలేదు. కట్ చేస్తే సెప్టెంబర్ 24న గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యబోతున్నారు. 1971 సెప్టెంబర్ 24న తాత నటసామ్రాట్ నటించిన ‘ప్రేమనగర్’ విడుదలై ఘన విజయం సాధించింది..

Chaitu

సరిగ్గా 50 సంవత్సరాల తర్వాత మనవడు యువ సామ్రాట్ నటించిన ‘లవ్ స్టోరీ’ కూడా అదే రోజున రిలీజ్ కాబోతుంది.. ఏఎన్నాఆర్ సినిమాలానే నాగ చైతన్య సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అక్కినేని అభిమానులు..

ఈ అరుదైన ఘటన తాలుకు వివరాలను అక్కినేని ఫ్యాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య ఇద్దరూ తమ కుటుంబ అభిమాని ట్వీట్‌ని రీ ట్వీట్ చేశారు. ‘లవ్ స్టోరీ’ లుకింగ్ గుడ్ రా చై.. ఆల్ ది బెస్ట్ అంటూ తనయుడికి నాగ్ విషెస్ తెలియజేశారు.

Naga Chaitanya : ఇదేం స్పీడు స్వామి..!