Lakshya: తప్పించి గెలవాలా? తప్పుడు దారిలో గెలవాలా?

యంగ్ హీరో నాగ శౌర్య 'లక్ష్య' సినిమాతో డిసెంబర్ 10న థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయ్యాడు. ఈ రోజు (బుధవారం) సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

Lakshya: తప్పించి గెలవాలా? తప్పుడు దారిలో గెలవాలా?

Lakshya

Lakshya: యంగ్ హీరో నాగ శౌర్య ‘లక్ష్య’ సినిమాతో డిసెంబర్ 10న థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయ్యాడు. ఈ రోజు (బుధవారం) సినిమా ట్రైలర్ విడుదల చేశారు. నాగశౌర్య విలుకాడిగా నటిస్తున్న ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం వీలు విద్యలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోగా.. ఎయిట్ ప్యాక్ బాడీ కూడా బిల్డ్ చేశాడు. దీంతో ఈ సినిమా పోస్టర్స్, ఫస్ట్ లుక్ నుండే అంచనాలు మొదలయ్యాయి. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది.

Samantha: సామ్ బాలీవుడ్ ప్లాన్స్.. ఒకేసారి 3 సినిమాలకు ఒప్పందం!

ఇక, ‘లక్ష్య’ ట్రైలర్ చూస్తే.. ఫుల్ కమర్షియల్ ప్యాకేజ్ గా కట్ చేశారు. టాలీవుడ్ కు కొత్తదైన విలువిద్య కాన్సెప్ట్‌కు తోడు.. లవ్, ఎమోషన్ కూడా జోడించారు. ట్రైలర్ ను బట్టి చూస్తే హీరోయిన్ కేతిక శర్మ పాత్రకు మంచి ప్రాముఖ్యం ఉన్నట్టు అర్థం అవుతోంది. ‘వాడు నిన్ను తప్పించి గెలవాలని అనుకున్నాడు. నువ్వు తప్పుడు దారిలో గెలవాలని అనుకున్నావ్. ఇద్దరూ ఒక్కటేగా’ అని హీరోకి హీరోయిన్ క్లాస్ పీకడం చూస్తుంటే ఆమెది హీరోను దారిలోకి తీసుకొచ్చే పాత్రలా అనిపిస్తుంది.

Song Promotions: ఒక్కో పాట రిలీజ్.. ప్రమోషన్స్‌లో కొత్త టెక్నిక్!

‘నేను వంద మందికి నచ్చక్కర్లేదు సార్. కానీ, నన్ను ఇష్టపడే ఒక్క వ్యక్తి కూడా నన్ను వద్దని అనుకుంటే.. ఇక నేను గెలిచేది దేనికి సార్?’ అని హీరో చెప్పే డైలాగ్ వింటే విలువిద్య కాన్సెప్ట్ మన దేశంలో ఎలా చూస్తారనేదిగా చెప్పినట్లుగా అర్ధమవుతుంది. ‘పడి లేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం’ అని జగపతి బాబు చెప్పే డైలాగ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తే,. ట్రైలర్‌లో నాగశౌర్య ఎయిట్ ప్యాక్ యంగ్ హీరోలను ఇన్స్పిరేషన్ గా కనిపించింది.

Arjun Sarja: మూడేళ్ళ క్రితం మీటూ ఆరోపణలు.. ఇప్పుడు క్లీన్ చిట్!

డైరెక్టర్ సంతోష్ టేకింగ్ లో కూడా మంచి సీరియస్ నెస్.. నాగశౌర్య లుక్స్ లో డిఫరెన్స్, డెడికేషన్.. హీరో గేమ్ నుండి డీవియేట్ కాకుండా హీరోయిన్ పాత్రతో ఎమోషన్స్.. కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి వారి నిర్మాణ విలువలు.. అన్నీ ట్రైలర్ ని పవర్ ప్యాక్ కమర్షియల్ సినిమాగా కనిపించేలా చేశాయి. నాగ శౌర్య రెండు విభిన్న గెటప్‌లలో కనిపిస్తుండగా.. హీరో క్రీడా జీవితంలో ఈ రెండు దశలు ఎలా ఉండనున్నాయన్నది ఉత్కంఠ రేపుతోంది.