Arjun Sarja: మూడేళ్ళ క్రితం మీటూ ఆరోపణలు.. ఇప్పుడు క్లీన్ చిట్!

మూడేళ్ళ క్రితం హాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం మన దేశంలో కూడా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్, కోలీవుడ్ లో పలువురు నటీమణులు కొందరిపై ఆరోపణలు సంచలనంగా మారాయి.

Arjun Sarja: మూడేళ్ళ క్రితం మీటూ ఆరోపణలు.. ఇప్పుడు క్లీన్ చిట్!

Arjun Sarja

Arjun Sarja: మూడేళ్ళ క్రితం హాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం మన దేశంలో కూడా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్, కోలీవుడ్ లో పలువురు నటీమణులు కొందరిపై ఆరోపణలు సంచలనంగా మారాయి. అందులో యాక్షన్ కింగ్ అర్జున్ పై నటి శృతి హరిహరన్ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ‘విస్మయ’ అనే ద్విభాషా సినిమాలో నటిస్తున్న సమయంలో తనను అర్జున్ హత్తుకున్నాడని.. ఓ రొమాంటిక్ సీన్ రిహార్సల్స్ లో చేతులను తన వీపుపై ఉంచి గట్టిగా హత్తుకుని, ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుందని దర్శకుడికి చెప్పాడని శృతి ఆరోపించింది.

Pushpa: ఇక్కడ ప్రభాస్.. అక్కడ సల్మాన్.. బన్నీ కోసం ఈ ఇద్దరూ!

ఒక నటి అనుమతి తీసుకోకుండా ఇలా చేయడం దారుణమని శృతి అప్పుడు చేసిన మీటూ లైంగిక ఆరోపణలను అర్జున్ తిప్పి కొట్టడానికి ప్రయత్నించాడు. ఈ నేపధ్యంలో ఆమె అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా వివాదం మరింత ముదిరింది. బెంగళూర్‌లోని కబ్బన్‌పార్క్‌ పోలీసులకు శృతి అర్జున్‌పై ఫిర్యాదు చేయగా అప్పటి నుండి ఈ కేసులో విచారణ జరుగుతూనే ఉండగా.. కర్ణాటక పోలీసులు దాదాపు మూడేళ్ల విచారణ అనంతరం తాజాగా అర్జున్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చారు.

Akhanda: బీబీ3.. హిట్ అవుతుందా? తేడా కొడుతుందా?

విచారణలో ఎలాంటి ఆధారాలు లభించనందున అతనిపై ఉన్న అభియోగాలు ఎత్తివేస్తున్నట్లు పోలీసులు తమ నివేదికలో రూపొందించారు. మూడేళ్ల క్రితం నమోదైన ఈ కేసులో సాక్ష్యులు ఎవరూ లేకపోవడంతో అర్జున్‌పై అభియోగాలు వీగిపోయినట్లు బెంగళూరు పోలీసులు మెజిస్ట్రేట్‌కు నివేదిక సమర్పించారు. దీంతో ఈ కేసు ఇక్కడితో ముగిసిపోయింది. అయితే.. శృతి మీటూ ఆరోపణలు చేసిన సమయంలో అర్జున్ పరువు నష్టం దావా వేశాడు. బెంగళూర్‌ సిటీ సివిల్‌ కోర్టులో రూ.5 కోట్లు నష్టపరిహారం కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. మరి ఆ దావా ఏమైందో తెలియాల్సి ఉంది.