Akhanda: బీబీ3.. హిట్ అవుతుందా? తేడా కొడుతుందా?

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో రిలీజ్ అవుతున్న హ్యాట్రిక్ మూవీ మీద హైప్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఫస్ట్ రెండు సినిమాల్లాగా హిట్ అవుతుందా? లేక ఏమన్నా తేడా కొడుతుందా అని ఫ్యాన్స్ తో..

Akhanda: బీబీ3.. హిట్ అవుతుందా? తేడా కొడుతుందా?

Akhanda

Akhanda: బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో రిలీజ్ అవుతున్న హ్యాట్రిక్ మూవీ మీద హైప్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఫస్ట్ రెండు సినిమాల్లాగా హిట్ అవుతుందా? లేక ఏమన్నా తేడా కొడుతుందా అని ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ తెగ టెన్షన్ పడిపోతుంటే బాలకృష్ణ మాత్రం బిందాస్ గా ఉండమని చెబుతున్నారు అభిమానులకు. సినిమా మీద బాలయ్య భారీ కాన్ఫిడెంట్ తో ఉన్నాడట.

Bigg Boss 5: హౌస్‌లో ఓ కంటెస్టెంట్‌కి అన్యాయం.. రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

బాలకృష్ణ-బోయపాటి హ్యాట్రిక్ మూవీ అనౌన్స్ చేసిన దగ్గరనుంచే ఎక్స్ పెక్టేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఆ ఎక్స్ పెక్టేషన్స్ అన్నీ కన్ క్లూజన్ కి వచ్చేశాయి. మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండడంతో అటు అఖండ టీమ్ తో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. అంతేకాదు కోవిడ్ తర్వాత రిలీజ్ అవుతున్న పెద్ద స్టార్ సినిమా కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఇండస్ట్రీ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తోంది.

Akhanda: నో డౌట్.. మరోసారి మాస్ మానియాని చూపించిన బాలయ్య!

సెకండ్ వేవ్ తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయినా.. కోవిడ్ తర్వాత రిలీజ్ అవుతున్న పెద్ద స్టార్ హీరో సినిమా బాలకృష్ణ అఖండ. అందుకే ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది..? అసలుసినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటూ మేకర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే బోయపాటితో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తూ ఫుల్ యాక్షన్ తో రాబోతున్నారు బాలకృష్ణ. ఆడియన్స్ కి కావల్సిన అన్ని ఎలిమెంట్స్ తో సినిమాని ప్యాక్ చేశారు కాబట్టే.. బాలయ్య ఈ సారి సినిమా హిట్ అవుతుంది.. అయ్యి తీరుతుంది అంటూ అభిమానులకు భరోసా ఇస్తున్నారు.

Akhanda-KGF 2: టెక్నో వార్.. కేజీఎఫ్-2 వర్సెస్ అఖండ..!

బాలకృష్ణ సినిమాలంటే సహజంగానే డైలాగ్స్.. యాక్షన్ సీక్వెన్స్ లను ఊహించుకుంటారు ఆయన ఫ్యాన్స్. దానికి తగ్గట్టు బాలకృష్ణకు సవాల్ విసిరే పవర్ ఫుల్ విలన్ ఉంటే అభిమానులకు పండగే. అంతకు ముందు బోయపాటి తీసిన రెండు సినిమాల్లోను భయంకరమైన విలనిజాన్ని చూపించారు. ఈ సారి కూడా శ్రీకాంత్ విలన్ క్యారెక్టర్ లో అదే రేంజ్ లో యాక్షన్ ని, డ్రామాని చూపిస్తున్నామని, అందుకే సినిమా సక్సెస్ మీద అంత కాన్పిడెంట్ గా ఉన్నామంటోంది టీమ్. టీజర్లతోనే సినిమా మీద హైప్స్ పెంచేసిన బాలయ్య బొమ్మ ధియేటర్లో ఎప్పుడెప్పుడు పడుతుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.