Akhanda: నో డౌట్.. మరోసారి మాస్ మానియాని చూపించిన బాలయ్య!

నందమూరి నటసింహం బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా అఖండ. ఈ సూపర్ హిట్ కాంబో నుంచి వస్తున్న మూడవ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Akhanda: నో డౌట్.. మరోసారి మాస్ మానియాని చూపించిన బాలయ్య!

Balayya

Akhanda: నందమూరి నటసింహం బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా అఖండ. ఈ సూపర్ హిట్ కాంబో నుంచి వస్తున్న మూడవ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి పాటలు, పోస్టర్స్ సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తవగా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఈరోజే (నవంబర్ 27) ఘనంగా నిర్వహించారు.

Bigg Boss 5: నన్ను వదిలేస్తున్నావా.. సిరికి బాయ్ ఫ్రెండ్ సూటి ప్రశ్న!

శిల్పకళావేదికగా జరిగిన ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయగా.. దర్శక దిగ్గజం రాజమౌళి ప్రత్యేక అతిధిగా వచ్చారు. ఈ వేడుక కోసం అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల నుండి భారీగా తరలిరాగా.. శిల్పకళావేదిక కెపాసిటీ సరిపోలేదు. మరోవైపు శిల్పకళావేదిక వైపు వెళ్లే అన్ని దారులు ట్రాఫిక్ జామ్ తో శనివారం సాయంత్రం రోడ్లు కిక్కిరిసిపోయాయి. మరోవైపు కొందరు అభిమానుల వద్ద పాసులు ఉన్నా శిల్పకళావేదికకు ఎంట్రీ ఇవ్వలేదని కొందరు అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగగా ఈవెంట్ ఆర్గనైజర్లు కల్పించుకొని సముదాయించారు.

Bigg Boss 5: పింకీ ఔట్.. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఈమేనా?

ఇక, నేడు జరిగిన ఈ ఈవెంట్, పబ్లిక్ టాక్, ఇండస్ట్రీ టాక్ ను బట్టి చూస్తే.. బాలయ్య మరో బ్లాక్ బస్టర్ కి రెడీ అయ్యాడని అర్ధమైంది. సింహం సోలోగా వస్తున్నట్టు.. బాలయ్య సోలో హీరోగా, డ్యూయల్ రోల్ లో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. అఖండ సినిమాతో అఖండ విజయాన్ని అందుకోడానికి అన్నీ రెడీ చేసుకున్న బాలయ్య.. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మరోసారి తన మాస్ మానియాని చూపించాడు. నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న అఖండ మూవీ రిలీజ్ హడావిడి స్టార్ట్ చేసింది.

Katrina Kaif: క్యాట్-విక్కీ మ్యారేజ్ మిస్టరీ.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్!

అల్లు అర్జున్, రాజమౌళి స్పెషల్ గెస్ట్ లుగా అటెండ్ అయిన ఈ ఈవెంట్ సినిమా మీద అంచనాల్ని ఓ రేంజ్ లో పెంచేసింది. అటు నందమూరి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ సందడితో సినిమా మీద హైప్స్ పెరిగిపోయాయి. బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ప్రగ్యాజైస్వాల్ తో పాటు జగపతి బాబు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్న అఖండ మూవీలో శ్రీకాంత్ మెయిన్ విలన్ గా కనిపిస్తున్నాడు.

December Film Releases: ఇయర్ ఎండ్ సిల్వర్ స్క్రీన్ స్టార్ హీరోలదే!

బోయపాటి స్టైల్ మాసీ యాక్షన్ కి తోడు, బాలయ్య మార్క్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో సినిమాని రిలీజ్ కు రెడీ చేశారు. సోలో హీరోగా సినిమాలు చేస్తున్న బాలయ్య.. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారు. ఒక వైపు యాక్షన్ క్యారెక్టర్ లో కనిపిస్తున్న బాలకృష్ణ.. మరోవైపు అఘోరాగా పవర్ ఫుల్ రోల్ లో సరికొత్తగా కనిపిస్తున్నారు. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన అఖండ మూవీ తో బాలయ్య హిట్ కొడతారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీమ్. అసలే ఈ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మూడో సారి తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ మరో రేంజ్ కి వెళ్లిపోయాయి.