Nagababu : హెయిర్ డ్రెస్సర్‌కి మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు స‌హాయం.. అందుకేనా??

ఇటీవల మంచు మోహ‌న్‌బాబు, విష్ణు కలిసి ఒక హెయిర్ డ్రెస్సర్ పై తమ విలువైన మేకప్ సామాన్లు దొంగలించారని పోలీసు కేసు పెట్టారు. అయితే ఆ హెయిర్ డ్రెస్సర్ ఒక వీడియోని రిలీజ్ చేస్తూ.........

Nagababu : హెయిర్ డ్రెస్సర్‌కి మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు స‌హాయం.. అందుకేనా??

Nagababu

Nagababu :  ఇటీవల మంచు మోహ‌న్‌బాబు, విష్ణు కలిసి ఒక హెయిర్ డ్రెస్సర్ పై తమ విలువైన మేకప్ సామాన్లు దొంగలించారని పోలీసు కేసు పెట్టారు. అయితే ఆ హెయిర్ డ్రెస్సర్ ఒక వీడియోని రిలీజ్ చేస్తూ.. త‌న‌ను, త‌న కుల వృత్తిని అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషించాడ‌ని, అందుకే జాబ్ లోంచి మానేస్తే తిరిగి త‌నపైనే త‌ప్పుడు కేసు పెట్టాడంటూ తెలిపాడు. దీంతో గత రెండు రోజులుగా ఈ న్యూస్ టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. ఆ హెయిర్ డ్రెస్సర్ ని కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాయి. ఈ ఇంటర్వ్యూలలో తన తప్పేమి లేదని, నేను చాలా దీన స్థితిలో ఉన్నానని, తన కుటుంబ పరిస్థితుల గురించి చెప్పాడు.

 

హెయిర్ డ్రెస్సర్ నాగ‌శ్రీను త‌న‌ తల్లి బ్రెయిన్‌ స్ట్రోక్‌తో హాస్పిట‌ల్‌లో ఉంద‌ని, త‌న‌కు జీతం కూడా రాలేద‌ని, డ‌బ్బుల‌కు చాలా ఇబ్బందిగా ఉంద‌ని తెలిపాడు ఇంటర్వ్యూలో. ఈ విషయం మెగా బ్రదర్ నాగబాబుకు తెలియడంతో నాగ శ్రీనుని పిలిపించి 50వేల రూపాయల‌ ఆర్ధిక సహాయం చేశాడు. అంతే కాక వారికి అపోలో ఆస్ప‌త్రిలో మెడిక‌ల్ చెక‌ప్ కూడా ఫ్రీగా చేయిస్తామని మాట ఇచ్చారు. దీంతో నాగశ్రీను నాగబాబుకి థ్యాంక్స్ చెప్తూ ఆనందం వ్యక్తం చేశాడు.

అయితే ఇప్పుడు ఈ వార్త చర్చల్లో నిలుస్తుంది. ‘మా’ ఎలక్షన్స్ టైం నుంచి మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి మధ్య మళ్ళీ విభేదాలు ఏర్పడ్డాయని అంతా అనుకుంటున్నారు. ఇటీవల సినీ పరిశ్రమ సమస్యల గురించి మాట్లాడటానికి చిరంజీవి వెళ్ళినప్పుడు మంచు కుటుంబం కౌంటర్లు వేయడం, మంచు విష్ణు పేర్ని నానిని ఇంటికి తీసుకురావడం, మంచు విష్ణు సపరేట్ గా జగన్ ని కలవడం.. ఇలా కొన్ని సంఘటనలతో మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి మధ్య మళ్ళీ దూరం ఏర్పడిందని తెలుస్తుంది.

Mahesh Vitta : నాలుగేళ్లుగా రిలేషన్.. త్వరలోనే పెళ్లి..

ఇప్పుడు మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూలో నాగబాబు తలదూర్చి అతనిని పిలిపించి మరీ ఆర్థిక సహాయం చేసాడని, మంచు ఫ్యామిలీకి కౌంటర్ ఇచ్చారని కొంతమంది అంటున్నారు. కొంతమంది మాత్రం మెగా ఫ్యామిలీ ఎవరు కష్టాల్లో ఉన్నా సహాయం చేస్తుంది, అందులో సినీ పరిశ్రమ వాళ్ళు కష్టాల్లో ఉంటే కచ్చితంగా సహాయం చేస్తారని అంటున్నారు.

Shanmukh Jaswanth : ఫేవరేట్ హీరోని కలిసిన ఆనందంలో షన్ను.. తనే వచ్చి షన్నుకి హగ్ ఇచ్చిన సూర్య

మరి మంచు ఫ్యామిలీ పోలీసు కేసు పెట్టిన వ్యక్తికి నాగబాబు దగ్గరికి తీసుకొని ఎందుకు సహాయం చేశారో వాళ్ళకే తెలియాలి. ఈ సంఘటనతో మరోసారి ఈ రెండు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతుందని అంతా అనుకుంటున్నారు. దీనిపై మంచు ఫ్యామిలీ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి మరి.