MAA Building : మోహన్ బాబుకి నాగబాబు కౌంటర్..

‘మా’ అసోసియేషన్ బిల్డింగ్ గురించి మోహన్ బాబు చేసిన విమర్శలకు మెగా బ్రదర్ నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు..

MAA Building : మోహన్ బాబుకి నాగబాబు కౌంటర్..

Nagababu

MAA Building: ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ ప్రకాష్ రాజ్‌కి ఉండడంతో ఆయన గెలుపు పక్కా అని ఫిక్స్ అయిపోయారు చాలా మంది. అయితే మొదట్లో హడావిడి చేసిన మంచు విష్ణు ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు.

MAA Elections 2021 : ‘మా’ మధ్య విబేధాలు లేవు..

‘మా’ బిల్డింగ్ కోసం మూడు చోట్ల స్థలాలు చూశానని.. త్వరలో అందరితో చర్చించి ఒక ప్లేస్‌ని ఫైనల్ చేస్తామని చెప్పి కామ్ అయిపోయాడు. ఇంతలో బండ్ల గణేష్ లైన్‌లోకి రావడం.. జీవిత రాజశేఖర్, బండ్ల మధ్య మాటల యుద్ధం జరగడంతో ‘మా’ ఎన్నికల వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది.

MAA Hema : నరేష్.. రూ.5కోట్లలో రూ.3కోట్లు ఖర్చు పెట్టేశారు, వైరల్‌గా మారిన నటి వాయిస్ మేసేజ్

పోటీలో ఎవరు నిల్చున్నా అందరూ కూడా ‘మా’ బిల్డింగ్ గురించే మాట్లాడుతున్నారు. అయితే ఇటీవల జరిగిన ‘మా’ సభ్యుల జూమ్ మీటింగ్‌లో ‘మా’ కోసం బిల్డింగ్ కొనడం, కొన్నదానికంటే తక్కువ రేటుకి అమ్మడం ఎందుకు చెయ్యాల్సి వచ్చిందనేదాని గురించి సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రశ్నిస్తూ విమర్శలు చేశారు.. రీసెంట్‌గా మెగా బ్రదర్ నాగబాబు, ఆయన వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ తన ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశారు.

Prakash Raj : వీరాభిమాని పాదయాత్ర.. విలక్షణ నటుడు ట్వీట్ వైరల్..

‘‘ఇటీవల జరిగిన ‘మా’ సభ్యుల జూమ్ మీటింగ్‌లో మోహన్ బాబు నా పేరు ఎత్తకుండానే విమర్శలు చేశారు. ఆయన ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్నారు.. ఆయన అడగడంలో తప్పు లేదు కానీ ఆ అడిగేదేదో నేను అధ్యక్షుడిగా ఉన్న టైంలోనే అడగాల్సింది. లేట్ చేశారు. అయినా మోహన్ బాబు అడిగిందానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ‘మా’ బిల్డింగ్ ఖాళీ చెయ్యమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ప్రతి మూడునెలలకొసారి ప్రెజర్ పెడుతుండేవారు. అప్పుడు ‘మా’ బిల్డింగ్ గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది.. తర్వాత బిల్డింగ్ కోసం ల్యాండ్ కొనడం.. బిల్డింగ్ కట్టడం జరిగింది. శివాజీ రాజా అధ్యక్షుడిగా, నరేష్ సెక్రటరీగా ఉన్నప్పుడు బిల్డింగ్‌ని చాలా తక్కువకి అమ్మారు.. ఆ విషయంలో మీకేమైనా వివరాలు కావాలంటే నరేష్‌ని అడగండి. నేను చాలా సౌమ్యంగా సమధానమిస్తున్నాను. ఇంకోసారి నా పేరు తీస్తే పద్ధతిగా ఉండందు’’ అంటూ మోహన్ బాబు ప్రశ్నలపై ఘాటుగా వ్యాఖ్యానించారు నాగబాబు..