Prakash Raj : వీరాభిమాని పాదయాత్ర.. విలక్షణ నటుడు ట్వీట్ వైరల్..

‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ విజయం సాధించాలని తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి రూరల్, కోలమూరు గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ పాదయాత్ర చేపట్టాడు..

Prakash Raj : వీరాభిమాని పాదయాత్ర.. విలక్షణ నటుడు ట్వీట్ వైరల్..

Prakash Raj Fan

Updated On : August 19, 2021 / 12:18 PM IST

Prakash Raj: వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఎప్పుడైతే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని ప్రకటించారో అప్పటినుంచి వాతావరణం వేడెక్కింది. 2021 ‘మా’ ఎలక్షన్స్ పలు వివాదాలకు దారి తీసాయి. ఎవరేమన్నా సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు ప్రకాష్ రాజ్.

Prakash Raj : మెగాస్టార్‌ని మీట్ అయిన ప్రకాష్ రాజ్..

అయితే ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ విజయం సాధించాలని తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి రూరల్, కోలమూరు గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ పాదయాత్ర చేపట్టాడు. కొద్దికాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు రంజిత్. ఇతను వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్‌కు వీరాభిమాని.

Ponniyin Selvan : డెడికేషన్.. గాయంతోనే షూటింగ్‌కి ప్రకాష్ రాజ్..

తన అభిమాన నటుడు ‘మా’ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలని కోలమూరు నుంచి హైదరాబాద్‌కు 485 కి.మీటర్ల పాదయాత్ర చేపట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. రంజిత్‌ను తిరిగి ఇంటికి వెళ్లిపొమ్మని, త్వరలోనే వ్యక్తిగతంగా తనను కలుస్తానని మాటిచ్చారు. తన అభిమానిని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Prakash Raj Tweet