Nagarjuna : ‘బిగ్ బాస్ 5’ షూటింగ్లో నాగార్జున.. లుక్ అదిరిందిగా..!
‘కింగ్’ నాగార్జున సిక్స్టీ ప్లస్‌లో కూడా థర్టీ ప్లస్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు.. వరుస పెట్టి సినిమాలు లైనప్ చేస్తూనే.. మరోసారి స్మాల్ స్క్రీన్ మీద సందడి చెయ్యడానికి రెడీ అవుతున్నారు..
Nagarjuna: ‘కింగ్’ నాగార్జున సిక్స్టీ ప్లస్‌లో కూడా థర్టీ ప్లస్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు. వరుస పెట్టి సినిమాలు లైనప్ చేస్తూనే.. మరోసారి స్మాల్ స్క్రీన్ మీద సందడి చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తో బుల్లితెర ఆడియన్స్‌ను ఆకట్టుకుని, తెలుగు ‘బిగ్ బాస్’ మూడు, నాలుగు సీజన్లతో అదరగొట్టేశారు.
‘బిగ్ బాస్’ ఫస్ట్ సీజన్ నేచురల్ స్టార్ నాని, సెకండ్ సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. 3, 4 సీజన్ల తర్వాత ఇప్పుడు 5th సీజన్ స్టార్ట్ కాబోతోంది. వరుసగా మూడోసారి కూడా అక్కినేని అందగాడే హోస్ట్ చెయ్యబోతున్నారు. హాట్ సీట్లో కూర్చుని ప్రశ్నలడిగినా, హౌస్‌లో కంటెస్టెంట్లను కంట్రోల్ చేసినా.. మోర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో తన స్టైల్ మేనరిజమ్స్‌తో, మంచి ఈజ్ అండ్ ఎనర్జీతో అలరించారు నాగ్.
వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు ఆడియన్స్‌ని మరింత ఆసక్తిగా ఎంటర్టైన్ చెయ్యడానికి రెడీ అవుతోంది. వరుసగా నాలుగు సీజన్లతో టీవీ ప్రేక్షకులలో హైప్ క్రియేట్ చేస్తూ ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 త్వరలో స్టార్ మాలో స్టార్ట్ కానుంది. ‘బిగ్ బాస్’ విజువల్ ఐడెంటిటీతో పాటు గేమ్‌లోని డిఫరెంట్ వేరియేషన్స్‌ను తెలియజేసేలా డిజైన్ చేసిన లోగో ఫస్ట్‌లుక్ వీడియో ఆకట్టుకుంటోంది.
Bigg Boss 5 : మోర్ ఫన్.. మోర్ ఎంటర్టైన్మెంట్..
ఈసారి కంటెస్టెంట్లకు సంబంధించిన వివరాలను మరింత సీక్రెట్‌గా ఉంచుతున్నారు. రీసెంట్గా నాగార్జున ‘బిగ్ బాస్ 5’ ప్రోమో షూట్లో పాల్గొన్నారు. అప్పుడు తీసిన పిక్స్ బయటకొచ్చాయి. సరికొత్త గెటప్‌లో ‘కింగ్’ లుక్ అదిరిపోయింది. బ్లాక్ డ్రెస్‌లో గాగుల్స్‌తో స్టైల్‌గా నడుస్తున్న పిక్, చేతిలో పెద్ద గన్ పట్టుకుని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ‘వైల్డ్ డాగ్’ తో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన నాగ్.. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో హై రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. గుల్ పనాంగ్, అనైకా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్డ్ రోల్లో కనిపించనున్నారు ‘కింగ్’. దీంతో పాటు ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్ ‘బంగార్రాజు’ కూడా పట్టాలెక్కించబోతున్నారు. ‘యువసామ్రాట్’ నాగ చైతన్యతో కలిసి నటించబోతున్నారు నాగార్జున.
Bangarraju : కష్టమైనా కృతినే ఫిక్స్ చేశారు.. ఎంత ఇస్తున్నారో తెలుసా..!