Nagarjuna: ఫుల్ జోష్‌లో నాగ్.. బ్యాచిలర్ టీమ్‌కు సక్సెస్ పార్టీ!

మొత్తానికి అక్కినేని అఖిల్ ఓ సక్సెస్ చూశాడు. బొమ్మరిల్లు తర్వాత ఎన్నో అపజయాలు చూసిన భాస్కర్ కూడా తనను తాను నిరూపించుకున్నాడు.

Nagarjuna: ఫుల్ జోష్‌లో నాగ్.. బ్యాచిలర్ టీమ్‌కు సక్సెస్ పార్టీ!

Nagarjuna

Nagarjuna: మొత్తానికి అక్కినేని అఖిల్ ఓ సక్సెస్ చూశాడు. బొమ్మరిల్లు తర్వాత ఎన్నో అపజయాలు చూసిన భాస్కర్ కూడా తనను తాను నిరూపించుకున్నాడు. ఏదైతేనేం అక్కినేని వారసుడికి ఓ విజయం దక్కడంతో ఆ ఇంట్లో సక్సెస్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మధ్యనే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సక్సెస్ పార్టీ ఇచ్చాడట. సినిమా యూనిట్ తో పాటు అఖిల్ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఈ పార్టీకి హాజరయ్యారు.

Riya Sen: ఈ బికినీ బేబీ సంపదకి సోషల్ మీడియా షేక్!

కాగా, ఇప్పుడు అఖిల్ తండ్రి నాగార్జున కూడా కొడుకు సక్సెస్ ను సెలబ్రేట్ చేసేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తుంది. నిజానికి అఖిల్ సక్సెస్ కోసం ఓ తండ్రిగా నాగార్జున చాలా ప్రయత్నాలు చేశాడు. అఖిల్ తొలి సినిమా నుండే వెన్నంటి నడిపించే ఓ తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించేందుకు చాలా కృషి చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే నాగార్జునతో సన్నిహితంగా ఉండే అల్లు అరవింద్ ను నమ్మి బ్యాచిలర్ కు ఒకే చెప్పాడు.

Priyanka Jawalkar: చూడచక్కని రూపం.. సొగసు మందారం!

అల్లు అరవింద్ కథ మీద నమ్మకం.. భాస్కర్ తన టాలెంట్ నిరూపించుకొనే అవకాశం కలిసి సినిమా సక్సెస్ తీరం దాటింది. దీంతో ఇప్పుడు నాగార్జున కూడా తన స్నేహితులు, శ్రేయోభిలాషులతో కుమారుడి విజయాన్ని పంచుకోనున్నాడు. ఈ పార్టీకి మెగా ఫ్యామిలీ కూడా హాజరునున్నట్లుగా తెలుస్తుంది. అక్కినేని కుటుంబంతో మెగా ఫ్యామిలీకి దగ్గరి అనుబంధం ఉంది. పైగా బ్యాచిలర్ సినిమా కూడా మెగా కాంపౌండ్ నుండే వచ్చింది.

KGF 2: అటకెక్కిన ప్రమోషన్.. యష్ ఫ్యాన్స్‌లో నిరాశ!

అందుకే ఇటు అక్కినేని, అటు మెగా కుటుంబాలు ఈ పార్టీకి అటెండ్ కానుండడంతో ఇండస్ట్రీ టాక్ గా మారింది. బ్యాచిలర్ సినిమా యూనిట్ తో ఇండస్ట్రీలో నాగార్జునకు సన్నిహితంగా ఉండే సినీ, రాజకీయ ప్రముఖులకు కూడా ఈ పార్టీకి హాజరుకానున్నట్లు తెలుస్తుంది.