KGF 2: అటకెక్కిన ప్రమోషన్.. యష్ ఫ్యాన్స్‌లో నిరాశ!

కేజేఎఫ్ సినిమా దక్షణాదిలోనే తమిళ, తెలుగు తర్వాత చిన్నదిగా చూసే కన్నడలో విడుదలై ఇండియా మొత్తాన్ని తనవైపు చూసేలా చేసిన సినిమా. ఈ సినిమాలో నటించిన యష్ పాన్ ఇండియా స్టార్ అయితే..

KGF 2: అటకెక్కిన ప్రమోషన్.. యష్ ఫ్యాన్స్‌లో నిరాశ!

Kgf Chapter 2

KGF 2: కేజేఎఫ్ సినిమా దక్షణాదిలోనే తమిళ, తెలుగు తర్వాత చిన్నదిగా చూసే కన్నడలో విడుదలై ఇండియా మొత్తాన్ని తనవైపు చూసేలా చేసిన సినిమా. ఈ సినిమాలో నటించిన యష్ పాన్ ఇండియా స్టార్ అయితే.. దర్శకుడు పాన్ ఇండియా స్టార్లకు హాట్ ఫెవరెట్ దర్శకుడి మారిపోయాడు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ నుండి అది కూడా కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్ వస్తుందంటే ఆ అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Bigg Boss 5: కాజల్‌ను జాకీలేసి లేపే ప్రయత్నం చేస్తున్నారా?

కేజీఎఫ్ చాఫ్టర్ 2 సినిమాపై అభిమానులు పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే సినిమా నుండి వదిలిన పోస్టర్లు, టీజర్ తో మరో మెట్టు ఎక్కించేశాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఇండియా వైడ్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే.. సినిమా మాత్రం వాయిదాల మీద వాయిదా పడి చివరికి వచ్చే ఏడాది వేసవికి ఫిక్స్ అయింది. 2022 ఏప్రిల్ లో కేజీఎఫ్ 2 విడుదల చేస్తామని అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు.

Prabhas: డార్లింగ్ ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్ అదరహో!

కేజీఎఫ్ 2 నుండి వచ్చిన చివరి అప్ డేట్ కూడా అదే. ఏప్రిల్ లో సినిమా విడుదల అవుతుందని చెప్పిన తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. కనీసం పండగలు, ప్రత్యేక దినాల సందర్భంగా కూడా ఒక్క పోస్టర్ కూడా వదలడం లేదు. చివరికి అక్టోబర్ 21న హీరోయిన్ శ్రీనిధి పుట్టినరోజు కాగా.. ఆమెకి కేవలం శుభాకాంక్షలు చెప్పారు తప్ప ఎలాంటి పోస్టర్ లేదు. దీంతో యష్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.

MAA Election: ‘మా’ ఎన్నికలలో వైసీపీ.. ఇవిగో సాక్ష్యాలు!

ఈ రోజుల్లో సినిమాను ఎంత ప్రమోట్ చేసుకుంటే సినిమా అంత రాబడుతుంది. ఓపెనింగ్స్ రాబట్టాలంటే సినిమా ప్రమోషన్ చాలా కీలకం. అయితే.. విడుదలకు ఇంకా చాలా సమయం ఉందని మేకర్స్ ప్రస్తుతం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. యష్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం కూడా కేజేఎఫ్ 2 మీద కాన్షన్ట్రేట్ చేయలేకపోతున్నారు. కనీసం ఖర్చు లేని పోస్టర్ల విడుదలకు కూడా మేకర్స్ లైట్ తీసుకోవడం అభిమానులకు బాధ కలిగిస్తుంది.