MAA Election: ‘మా’ ఎన్నికలలో వైసీపీ.. ఇవిగో సాక్ష్యాలు!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కానీ, ఎన్నికల వివాదం మాత్రం ఇంకా ముగియలేదు. ఎన్నికలలో అధ్యక్ష బరిలో..

MAA Election: ‘మా’ ఎన్నికలలో వైసీపీ.. ఇవిగో సాక్ష్యాలు!

Maa Election

MAA Election: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కానీ, ఎన్నికల వివాదం మాత్రం ఇంకా ముగియలేదు. ఎన్నికలలో అధ్యక్ష బరిలో నిలిచి ఓడిన ప్రకాష్ రాజ్ ఎన్నికల నాటి నుండి నేటి వరకు విష్ణు వర్గంతో పాటు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ పై కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మా ఎన్నికలలో ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేతల జోక్యం ఉందని ప్రకాష్ రాజ్ తాజాగా తీవ్ర ఆరోపణలు చేశారు.

Telugu Films Releases: టార్గెట్ డిసెంబర్.. అందరి చూపు ఈనెలపైనే!

కృష్ణా జిల్లా జగ్గయ్య పేటకు చెందిన నూకల సాంబశివరావు అనే వ్యక్తి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో కలిసి ఉన్న ఫోటోలతో పాటు మంచు మోహన్ బాబుతో గతంలో ఉన్న ఫోటోలను విడుదల చేసిన ప్రకాష్ రాజ్.. ఎన్నికల ముందు సాంబశివరావుతో మంచు విష్ణు కలిసిన ఫోటోలను.. సాంబశివరావు ఎన్నికల కేంద్రం వద్ద ఉన్న ఫోటోలను కూడా విడుదల చేశారు.

Telugu Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్ మీద తెలుగు హీరోల దండయాత్ర!

సాంబశివరావు ఎన్నికల కేంద్రంలోకి వెళ్లి.. ఓటర్లను బెదిరించి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించిన ప్రకాష్ రాజ్.. అసలు సాంబశివరావును ఎన్నికల కేంద్రంలోకి ఏ అధికారంతో అనుమతించారని ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారిని ప్రశ్నించారు. ఇప్పటికే ఎన్నికల కేంద్రంలో సీసీటీవీ ఫుటేజ్ ను తనకు అందించాలని కోరిన ప్రకాష్ రాజ్.. అసలు ఆ రోజు ఎన్నికల కేంద్రంలో ఏం జరిగిందో ప్రపంచానికి తెలియాల్సి ఉందని ప్రకాష్ రాజ్ తీవ్రంగా మండిపడ్డారు.

Telugu Senior hero’s: సస్పెన్స్‌లో సీనియర్ హీరోలు.. రిలీజ్ ఎప్పుడో?!

ఒక క్రిమినల్ కేసులు ఉన్న సాంబశివరావును సినీ పరిశ్రమకి చెందిన ఎన్నికలలో కనిపించడం.. ఏకంగా ఎన్నికల కేంద్రంలోకి ఆ వ్యక్తి వచ్చి ఓటర్లను బెదిరించడం.. ఈ ఎన్నికలు జరిగిన తీరును చెప్తున్నాయని ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆరంభం మాత్రమే కృష్ణమోహన్ గారు.. ప్రపంచానికి తెలియాల్సింది చాలా ఉందని ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారిని ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేశారు.