Bigg Boss 5: కాజల్‌ను జాకీలేసి లేపే ప్రయత్నం చేస్తున్నారా?

బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ఆరవ వారం కూడా పూర్తయి ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో మిగిలిన వాళ్ళతోనే షోను రక్తి కట్టించే బాధ్యతను నిర్వర్తిస్తున్న బిగ్ బాస్...

Bigg Boss 5: కాజల్‌ను జాకీలేసి లేపే ప్రయత్నం చేస్తున్నారా?

Bigg Boss 5 (1)

Bigg Boss 5: బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ఆరవ వారం కూడా పూర్తయి ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో మిగిలిన వాళ్ళతోనే షోను రక్తి కట్టించే బాధ్యతను నిర్వర్తిస్తున్న బిగ్ బాస్ ఒక్కోసారి ఒక్కో కంటెస్టెంట్ మీద ఎక్కడలేని ప్రేమను చూపిస్తాడా అనిపిస్తుంది. అసలు ఈ షోలో ఎక్కడిక్కడ ముందే అగ్రిమెంట్లు ఉంటాయని.. ఎవరెన్ని వారాలు ఉండాలో కూడా ముందే ఫిక్స్ అయి ఉంటుందనే ఆరోపణలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి.

Big Boss 5: అర్ధరాత్రి మానస్ దుప్పట్లో పింకీ.. బీబీ హౌస్‌లో మూడుముక్కలాట!

ఒక్కోసారి అది కూడా నిజమేనేమో అని ప్రేక్షకులకు కూడా అనుమానాలొస్తుంటాయి. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కో కంటెస్టెంట్ ను బిగ్ బాస్ జాకీలేసి మరీ లేపి అక్కడ కూర్చోబెడతాడు. ఆ మధ్య సీక్రెట్ టాస్క్ పేరుతో జెస్సీని జాకీ పెట్టి లేపి ఎక్కడో కూర్చోబెట్టాడు. ఇక, ఇప్పుడు ఈ వారం ఆ బంపర్ అఫర్ ను కాజల్ కు ఇచ్చినట్లు కనిపిస్తుంది. లోబోను జాకీలా వాడేసిన బిగ్ బాస్ లోబో ద్వారా కాజల్ ను కెప్టెన్ కంటెండర్ గా అవకాశం ఇచ్చాడు.

Big Boss 5: శ్రీరామచంద్ర.. హమీదా అర్ధరాత్రి ముద్దులు.. షో శృతి మించుతోందా?

అప్పటి వరకు సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న లోబోను తిరిగి ఇంట్లోకి పంపించిన బిగ్ బాస్ వెళ్లేప్పుడు లోబో చేతిలో రెండు గుడ్లు పెట్టాడు. అందులో ఒకటి బ్లాక్‌ అయితే రెండోది గోల్డ్‌. లోబో ఎవరికైతే ఈ బ్లాక్‌ ఎగ్‌ ఇస్తాడో వాళ్ళు కెప్టెన్సీ పోటీదారు కంటెండర్‌ నుండి తప్పుకోవాలి.. ఎవరికైతే గోల్డ్ ఇస్తాడో వాళ్ళు కెప్టెన్సీ కంటెండరుగా వెళ్లే ఛాన్స్ దక్కించుకుంటారు. లోబో బ్లాక్ శ్రీరామ్‌కి ఇవ్వగా గోల్డ్ కాజల్‌కి ఇచ్చాడు. ఇక్కడే బిగ్‌బాస్‌ స్ట్రాటజీ ఉపయోగించి చిన్న టాస్క్ అడ్డు పెట్టాడు. దాన్ని కాజల్ ఏదో చేయాలంటే చేసింది.

Big Boss 5: ఫాఫం.. ఉన్న ఒక్క జంటను విడగొట్టేశారే!

నిజానికి గుడ్ల టాస్క్‌లో కాజల్‌ ప్రదర్శన ఏ మాత్రం కనిపించదు. ఏదో ఒకటి రెండుసార్లు స్క్రీన్‌ మీద కనిపించగా టాస్క్ మొత్తం ఏడవడమే సరిపోయింది. అయితే.. ప్రియ కాజల్ ను టార్గెట్‌ చేస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడం పట్ల బిగ్ బాస్ కాజల్ పట్ల సానుభూతి కురిపించినట్లుగా ప్రేక్షకులను మాయచేశారు. మొత్తానికి కాజల్ ఈ వారం కెప్టెన్ కంటెండర్ గా అయితే కాగలిగింది. మరి కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్న వారిని డామినేట్ చేసి కాజల్ ఆ కుర్చీ అందుకుంటుందా.. లేక డామినేట్ చేయలేకపోయినా బిగ్ బాస్ మళ్ళీ జాకీ పెట్టి కుర్చీలో కూర్చోబెడతాడా అన్నది చూడాల్సి ఉంది.