Plastic Banknotes : ఆర్బీఐ ప్లాస్టిక్ నోట్లు తెస్తుందా? తడిసినా, మడిచినా చిరగవు.. పేపర్ కన్నా బెటరా? ఫుల్ డిటెయిల్స్!
Plastic Banknotes : ఆర్బీఐ పాలిమర్ నోట్లను పరిశీలిస్తోందన్న వార్తల నేపథ్యంలో ప్లాస్టిక్ కరెన్సీ ఏంటి? బెనిఫిట్స్? అదే పేపర్ నోట్లకు ప్లాస్టిక్ నోట్లకు మధ్య తేడా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Plastic Banknotes ( Image Credit : AI )
- ఆర్బీఐ పాలిమర్ నోట్లను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం
- పాలిమర్ నోట్లు నీరు, తేమ వల్ల చిరిగిపోవు, ఎక్కువకాలం మన్నిక
- ఈ కరెన్సీ టెక్నాలజీ ఇప్పటికే అనేక దేశాల్లో వాడుకలో ఉంది
Plastic Banknotes : భారత పేపర్ కరెన్సీకి ఇక కనిపించదా? రాబోయే రోజుల్లో పేపర్ కరెన్సీ పోయి ప్లాస్టిక్ కరెన్సీ రాబోతుందా? ప్రస్తుతం దేశంలో ఇదే పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. భవిష్యత్తులో మన చేతిలో రూ. 10, రూ. 50, రూ. 500 నోట్లు ఇకపై పేపర్ కాకుండా ప్లాస్టిక్‌లా మారిపోతే ఎలా ఉంటుంది?
మీడియా కథనాల ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పాలిమర్ కరెన్సీ నోట్ల దిశగా మరోసారి ఆలోచన (Plastic Banknotes) చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పెరుగుతున్న నగదు అవసరం, పాత నోట్లు చిరిగిపోవడం, ఫ్రింటింగ్ ఖర్చుల భారం పెరగడం వంటివి ఈ కొత్త టెక్నాలజీపై ఆసక్తి మళ్లీ పెరిగింది.
ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాలు ఈ ‘ప్లాస్టిక్ మనీ’ని వాడుతున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఇతర దేశాల బాటలో అడుగు వేయబోతుందా అన్న చర్చ నడుస్తోంది. కానీ, నిజంగా పాలిమర్ నోట్లు వస్తే మన జేబులోని డబ్బు రూపమే మారిపోయే అవకాశం లేకపోలేదు.
వాస్తవానికి, ఆర్బీఐ ప్లాస్టిక్ ఆధారిత కరెన్సీ నోట్లపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పాలిమర్ నోట్లు ఏంటి? ప్రస్తుత పేపర్ నోట్లకు మధ్య తేడా ఏంటి? బెనిఫిట్స్ ఎందులో ఎక్కువ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పాలిమర్ నోట్స్ అంటే ఏంటి? :
పాలిమర్ నోట్లు సాధారణ కాగితంతో తయారుకావు. వీటిని పాలిమర్ సబ్‌స్ట్రేట్ అనే ప్రత్యేక రకమైన ప్లాస్టిక్ ఫిల్మ్‌తో తయారు చేస్తారు. ఈ పదార్థం సాంప్రదాయ కాగితం కన్నా బలంగా ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ సాంకేతికతను వినియోగిస్తున్నాయి.
Read Also : ITR TDS Credit : టాక్స్ పేయర్లు ఎగిరిగంతేసే న్యూస్.. ఇక మీ ITR ఫైల్ చేయకున్నా TDS బెనిఫిట్ పొందొచ్చు..!
పాలిమర్ నోట్లు, పేపర్ నోట్ల కన్నా బెటరా? :
పేపర్ కరెన్సీ నోట్లు ఎక్కువకాలం వాడితే త్వరగా పాడైపోతాయి. తేమ, నీళ్లు లేదా పదేపదే మడతపెట్టినా వెంటనే నోట్ చిరిగిపోతుంది. పాలిమర్ నోట్లలో బెనిఫిట్ ఏమిటంటే.. నీరు, తేమకు అంత సులభంగా పాడైపోవు. అంతేకాదు.. త్వరగా చిరగవు. ఎక్కువ కాలం పాటు వాడుకలో ఉంటాయి. తద్వారా కేంద్ర బ్యాంకులు కొత్త నోట్లను మళ్లీ ముద్రించాల్సిన అవసరం తగ్గుతుంది.
ఈ టెక్నాలజీతో ఫేక్ నోట్లకు చెక్? :
పాలిమర్ నోట్లలో పారదర్శకం, మైక్రోప్రింటింగ్, స్పెషల్ సేఫ్టీ అంశాలతో సహా అనేక అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. దాంతో ఫేక్ నోట్లకు ఇక అడ్డుకట్ట పడినట్టే. అందుకే అనేక దేశాలు కరెన్సీ సేఫ్టీ కోసం పాలిమర్ టెక్నాలజీని వాడుతున్నాయి.
ఏయే దేశాలలో పాలిమర్ కరెన్సీ నోట్లు ఉన్నాయి? :
పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టిన మొదటి దేశంగా ఆస్ట్రేలియానే.. ఆ తర్వాత కెనడా, న్యూజిలాండ్, బ్రూనై, రొమేనియా, వియత్నాం, పాపువా న్యూ గినియాతో సహా అనేక దేశాలు ఈ టెక్నాలజీని తీసుకొచ్చాయి. ప్రస్తుతం పాలిమర్ కరెన్సీ ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో చలామణీలో ఉంది. మోడ్రాన్ కరెన్సీ ఫ్రింటింగ్ టెక్నాలజీ ఇదొక భాగంగా చెప్పవచ్చు.
గతంలో కరెన్సీని ఇలా తయారు చేశారా? :
భారతదేశంలో పాలిమర్ కరెన్సీ నోట్లు అనేవి పూర్తిగా కొత్త ఆలోచన కాదని గమనించాలి. 2012లో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన నగరాల్లో రూ. 10 పాలిమర్ నోట్ల క్షేత్రస్థాయి ప్రయోగాలకు ఆమోదం తెలిపింది. అయితే, ఈ టెక్నాలజీ పెద్ద ఎత్తున అమలు కాలేదు. ఇప్పుడు, దీని వినియోగంపై చర్చలు మరోసారి మొదలయ్యాయి.
భారత కరెన్సీ నోట్లు త్వరలో మారతాయా? :
కరెన్సీ నోట్ల మార్పు అనేది అంత ఈజీ కాదని మీడియా నివేదికలు చెబుతున్నాయి. కానీ, ఆర్బీఐ ఈ కరెన్సీ నోట్ల మార్పుపై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. భవిష్యత్తులో కేంద్ర బ్యాంకు ఈ టెక్నాలజీని వాడితే భారత కరెన్సీ వ్యవస్థలో అతిపెద్ద సాంకేతిక మార్పుకు నాంది పలుకుతుంది.
సామాన్య ప్రజలకు బెనిఫిట్ ఏంటి? :
పాలిమర్ నోట్లను అమల్లోకి తెస్తే.. సాధారణ ప్రజలకు ఎక్కువ కాలం మన్నికను అందిస్తాయి. ఫేక్ నోట్ల సమస్యను తగ్గుతుంది. ఆర్బిఐ నుంచి దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు..
