Gold Silver Price Today : ఒక్కసారిగా కుప్పకూలిన గోల్డ్ రేటు.. కారణం ఇదే.. ఏపీ, తెలంగాణలో 22, 24 క్యారెట్ల ధరలు ఇవే..
Gold Silver Price Today : బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ శుభవార్త. ఇవాళ గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి.
Gold Silver Price Today
Gold Silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. గత రెండు రోజులు నుంచి రికార్డు స్థాయిలో పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడింది. ఇవాళ ఒక్కసారిగా గోల్డ్, సిల్వర్ రేట్లు కుప్పకూలాయి.
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.2,070 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.1,900 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 50డాలర్లకు పైగా తగ్గింది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,137 డాలర్ల వద్దకు చేరింది.
వెండి ధర కూడా ఇవాళ భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ.5వేలు తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,45,910 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,33,750 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,46,060 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,33,900 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,47,930కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,35,600 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,50,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,45,000కు చేరగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,50,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
