Gold Rate Down : బంగారం ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజులోనే ఊహించని స్థాయికి పడిపోయిన ధర..
Gold Rate Down : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది.
Gold Rate Down
Gold Rate Down : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేటు ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఊహించని స్థాయికి గోల్డ్ పడిపోయింది.
Also Read : AP Rain Alert : ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాల్లో రెండ్రోజులు కుండపోత వర్షాలు..
బంగారం ధరల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుంటుంది. మంగళవారం ఒక్కరోజే 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.3,380 తగ్గింది. గత రెండుమూడు నెలల్లో ఒకేరోజు గోల్డ్ రేటు ఈ స్థాయిలో తగ్గలేదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. జులై నెల చివరి నాటికి గోల్డ్ రేటు రూ. లక్షకు చేరే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు తగ్గేందుకు ఇతర ప్రధాన కారణాల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచినప్పటికీ.. ఈ ఏడాదిలో మున్ముందు వడ్డీ రేట్లు పెంచక తప్పదని సంకేతాలు ఇచ్చింది. ఫెడ్ వడ్డీ రేట్ల టార్గెట్ 2శాతంలోపు ఉండాలంటే వడ్డీ రేట్లు పెంచాల్సి ఉందన్న అవశ్యకతను నొక్కి చెప్పింది. దీంతో ఇది కూడా బంగారం ధరలు తగ్గేందుకు కారణంగా నిలుస్తుంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర భారీగా పతనమవుతోంది.. ఔన్స్ గోల్డ్ ప్రస్తుతం 4,074 డాలర్లకు పడిపోయింది. రానున్న రోజుల్లో ఔన్సు గోల్డ్ 3, 500 డాలర్లకు పడిపోయేందుకు ఆస్కారం ఉందని, అదే జరిగితే.. భారత దేశంలో బంగారం ధర భారీగా తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
బుధవారం ఉదయం 7గంటలకు నమోదైన ధరల ప్రకారం.. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,44,590 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,540 వద్ద కొనసాగుతోంది. వెండి ధరకూడా తగ్గుతోంది. మంగళవారం కిలో వెండిపై రూ.5వేలు తగ్గగా.. ప్రస్తుతం కిలో వెండి రూ. 2,49,900 వద్ద కొనసాగుతోంది.
