Chennai Love Story Collections : కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ కలెక్షన్స్.. రెండు రోజుల్లో అదరగొట్టాడుగా.. ఎన్ని కోట్లు..?
కిరణ్ అబ్బవరం గత సినిమాలకంటే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. (Chennai Love Story Collections)
Chennai Love Story Collections
Chennai Love Story Collections : కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా తెరకెక్కిన సినిమా చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇటీవల జులై 24న థియేటర్స్ లో రిలీజయి పెద్ద హిట్ అయింది. SKN, సాయి రాజేష్ నిర్మాణంలో రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి లవ్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించింది. వీకెండ్స్ కావడంతో థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి.
కిరణ్ అబ్బవరం గత సినిమాలకంటే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి రోజు 12 కోట్లు సాధించిన ఈ సినిమా రెండు రోజుల్లో ఏకంగా 25.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రీమియర్స్ తో కలిపి ఈ కలెక్షన్స్ వచ్చినట్టు తెలిపారు. నేడు ఆదివారం కావడంతో కలెక్షషన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
Also Read : Mahesh Babu : మా రమేష్ అన్నయ్య కొడుకు వస్తున్నాడు.. జయకృష్ణ సినిమాపై మహేష్ స్పెషల్ పోస్ట్.. వీడియో వైరల్
కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ సినిమాకు దాదాపు 23 కోట్ల థియేటరికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఈ లెక్కన సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 50 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఇక నాన్ థియేటరికల్ బిజినెస్ కూడా దాదాపు 14 కోట్లకు జరిగిందని తెలుస్తుంది. కిరణ్ కెరీర్లో మరో సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

