Mahesh Babu : మా రమేష్ అన్నయ్య కొడుకు వస్తున్నాడు.. జయకృష్ణ సినిమాపై మహేష్ స్పెషల్ పోస్ట్.. వీడియో వైరల్
ఈ సినిమా కోసం, తన అన్నయ్య కొడుకు కోసం ఓ స్పెషల్ వీడియో చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేసారు మహేష్ బాబు. (Mahesh Babu)
Mahesh Babu
Mahesh Babu : ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో వస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జయకృష్ణ, బాలీవుడ్ భామ రాషా తడాని జంటగా తెరకెక్కుతున్న సినిమా శ్రీనివాస మంగాపురం. అశ్వినీ దత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్ పై జెమినీ కిరణ్ నిర్మాణంలో RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 30న రిలీజ్ కాబోతుంది.
తాజాగా ఈ సినిమా కోసం, తన అన్నయ్య కొడుకు కోసం ఓ స్పెషల్ వీడియో చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేసారు మహేష్ బాబు.
Also Read : Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్తో హాస్పిటల్లో నటుడు గబ్బర్ సింగ్ రమేష్.. అండగా నిలిచిన మెగాస్టార్..
మహేష్ బాబు ఈ వీడియోలో మాట్లాడుతూ.. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మా రమేష్ అన్నయ్య గారి అబ్బాయి జయకృష్ణ. అతను నటుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. మా ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉంది. ఇప్పటిదాకా చూసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. మేము చాలా ఎగ్జైట్ అవుతున్నాము. జయకృష్ణ, రషా తడాని పెయిర్ బాగుంది. వాళ్ళని చాలా బాగా చూపించినందుకు అజయ్ భూపతికి క్రెడిట్ ఇవ్వాలి. మ్యూజిక్ కూడా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో నా ఫేవరేట్ సాంగ్ అల్లెల్లే సాంగ్. ఈ సినిమా జులై 30 న రిలీజ్ అవుతుంది. అది నా రాజకుమారుడు రిలీజ్ డేట్.
నాకు తెలిసి నిర్మాత దత్ గారే ఈ డేట్ ప్లాన్ చేసి ఉంటారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, నేను.. మేమంతా వైజయంతి నుంచే వచ్చాము. ఇప్పుడు జయకృష్ణ కూడా వస్తున్నాడు. జయకృష్ణ, రషా ఈ విషయంలో లక్కీ. బాబాయ్ ఆది శేషగిరి రావు గారు కూడా ఈ సినిమాకు సపోర్ట్ చేసారు. నాన్నగారి అభిమానులు, నా అభిమానులు జయకృష్ణ, రషాలను ఆదరించాలని కోరుకుంటున్నాను. అందరికి అల్ ది బెస్ట్ అని అన్నారు. దీంతో ఈ వీడియోని మహేష్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
Extremely happy for #JaiKrishnaGhattamaneni and #RashaThadani on their debut with #SrinivasaMangapuram…. I wish the whole team the very best for July 30th!!! 🤗🤗🤗♥️♥️♥️@DirAjayBhupathi #RashaThadani @themohanbabu @AshwiniDuttCh @gvprakash @gemini_kiran @CKPicturesoffl pic.twitter.com/VPgSDQRmAn
— Mahesh Babu (@urstrulyMahesh) July 26, 2026
