Dharmendra Pradhan : ఒకప్పుడు విద్యార్థుల హీరో.. ఇప్పుడు విద్యార్థుల ఉద్యమంతో మంత్రి పదవికి రాజీనామా! ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ ప్రయాణంలో కీలక మలుపులు
Dharmendra Pradhan : ఒకప్పుడు విద్యార్థుల తరపున పోరాడి వారికి హీరోగా నిలిచిన ధర్మేంద్ర ప్రధాన్.. ఇప్పుడు విద్యార్థుల ఉద్యమంతోనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
Dharmendra Pradhan
Dharmendra Pradhan : రాజకీయాల్లో కాలం ఎన్నో మలుపులు చూపిస్తుందని మరోసారి రుజువైంది. ఒకప్పుడు ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి వీధుల్లో ఉద్యమించిన ధర్మేంద్ర ప్రధాన్.. మూడు దశాబ్దాల తర్వాత అదే తరహా వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read : YS Sharmila Health : ఆస్పత్రి బెడ్‌పై వైఎస్ షర్మిల.. ఏమైంది..? ఫొటో వైరల్
1997లో ఒడిశాలో ప్లస్-2 బోర్డు పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడంతో విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అప్పట్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నాయకుడిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ వేలాది మంది విద్యార్థులకు నాయకత్వం వహిస్తూ సచివాలయం ముట్టడించారు. పోలీసులు లాఠీచార్జ్ చేసినప్పటికీ ఉద్యమాన్ని కొనసాగించారు. చివరకు ప్రభుత్వం దిగివచ్చి ప్లస్-2 బోర్డు యాజమాన్యాన్ని రద్దు చేసి, సంస్కరణల కోసం కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షలను మళ్లీ నిర్వహించింది. ఆ ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ జీవితంలో కీలక మలుపుగా నిలిచింది.
ఇటీవల దేశవ్యాప్తంగా నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం తీవ్ర చర్చకు దారితీసింది. లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసనలు చేపట్టగా, పరీక్షల పారదర్శకతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశం రాజకీయంగానూ దుమారం రేపింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్దెత్తున విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువత ఉద్యమంతో ఢిల్లీ వీధులు రణరంగంగా మారాయి.
విద్యార్థుల ఉధ్యమం తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించింది. రెండు దఫాలుగా ప్రభుత్వ పెద్దలు, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగా.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. కోటి ఇవ్వాలని, ఉద్యమం సమయంలో విద్యార్థులపై పెట్టిన కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు. రెండు డిమాండ్లకు ఒప్పుకున్న కేంద్రం పెద్దలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు అంగీకరించలేదు. దీంతో ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలోని విద్యార్థుల ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో.. పెరిగిన రాజకీయ ఒత్తిళ్ల నడుమ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒకప్పుడు విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమించిన నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన.. అదే విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో మంత్రి పదవిని కోల్పోవడం రాజకీయ చరిత్రలో అరుదైన పరిణామంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
