Smartphone Prices : మెమరీ చిప్ కొరతపై బిగ్ అప్డేట్.. ఇక స్మార్ట్ఫోన్లు చౌకగా దొరుకుతాయా?!
Smartphone Prices : వచ్చే ఏడాది చిప్ సరఫరా ఇంకా పెరిగితే ఫలితంగా స్మార్ట్ఫోన్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
Smartphone Prices
- స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీకో గుడ్ న్యూస్
- ర్యామ్, స్టోరేజ్ మెమరీ చిప్‌ల ధరలు భారీగా పెరిగాయి
- చిప్ సప్లయ్ పెరుగుదలతో ఫోన్ల ధరలు తగ్గే ఛాన్స్
Smartphone Prices : స్మార్ట్ ఫోన్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. త్వరలో స్మార్ట్ఫోన్లు మళ్లీ చౌకగా మారనున్నాయి. మెమెరీ చిప్ కొరతపై కీలక అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇదేగానీ నిజమైతే ఇప్పుడు పెరిగిన ఫోన్ల ధరలు అంతే వేగంగా దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గడిచిన కొద్ది నెలలుగా స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ ధరలను అమాంతం పెంచేశాయి.
కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ఫోన్లు, పాత స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు రెండూ ఇప్పుడు అధిక ధరలకే మార్కెట్లో లభిస్తున్నాయి. ఇతర యూజర్ ఎలక్ట్రానిక్స్ కూడా ఇంకా ఖరీదైనవిగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా విడిభాగాల సరఫరా కొరత ఏర్పడటమే ముఖ్య కారణం.
గత కొన్ని నెలలుగా, ర్యామ్, స్టోరేజ్ మెమరీ చిప్‌ల ధరలు అధిక శాతం పెరిగాయి. ఎలక్ట్రానిక్ పరికరాల ధరపై నేరుగా ప్రభావం పడింది. అయితే ఇప్పుడు శుభవార్త ఏమిటంటే.. ఈ పెరిగిన ధరల నుంచి బయటపడే సమయం అతి త్వరలోనే ఉందని అంటున్నారు.
మళ్లీ చిప్ సప్లయ్ పెరిగే ఛాన్స్ :
ప్రపంచవ్యాప్తంగా DRAM, NAND చిప్‌ల కొరత కారణంగా స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు వంటి డివైజ్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో టిప్‌స్టర్ నుంచి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. పరిశ్రమ వర్గాలను సూచిస్తూ.. రెండు చైనా కంపెనీలు చిప్ తయారీలో నిమగ్నమై ఉన్నాయని టిప్‌స్టర్ పేర్కొన్నారు.
ఈ రెండు కంపెనీలను చాంగ్‌క్సిన్ మెమరీ టెక్నాలజీస్ (CXMT) యాంగ్జీ మెమరీ టెక్నాలజీస్ (YMTC)గా పిలుస్తారు. ఈ కంపెనీలు ప్రస్తుతం DRAM స్టాక్లను రెడీ చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ రెండు కంపెనీలు DRAM చిప్ స్టాక్లను మార్కెట్లోకి విడుదల చేస్తాయని చెబుతున్నారు.
2027లో ఫోన్ల ధరలు తగ్గుతాయా? :
అయితే, ఇప్పటికే, స్టోరేజ్ చిప్ తయారీదారులు మెమరీ చిప్ డిమాండ్‌ను తీర్చేందుకు తమ చిప్ సరఫరాను ఏఐ (AI) ఇండస్ట్రీకి మళ్లీంచారనే సంగతి తెలిసిందే. ఇది నిజమైతే మాత్రం మెమరీ చిప్‌ల సరఫరా పెరగడంతో ప్రస్తుత కొరత తగ్గుతుంది.
తద్వారా ఎలక్ట్రానిక్ భాగాల ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇలా జరిగితే 2027లో స్మార్ట్ ఫోన్ల ధరలు ఒక్కసారిగా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, డీఆర్ఏఎం (DRAM) నాండ్ (NAND) చిప్‌ల కొరత 2028 మొదటి త్రైమాసికం వరకు కొనసాగే అవకాశం ఉంది.
2027లో చిప్ సరఫరా పెరిగితే స్మార్ట్‌ఫోన్ ధరలు కూడా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. అయితే, స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఈ తగ్గిన ధరలను వినియోగదారులకు అందిస్తారా లేదా అనేదానిపై క్లారిటీ లేదు. స్మార్ట్‌ఫోన్ ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయి. దాంతో బడ్జెట్, మిడ్-రేంజ్, ఫ్లాగ్షిప్ ఫోన్లు అందుబాటు ధరలో లేవు. రాబోయే రోజుల్లో త్రైమాసికంలో కూడా ధరలు దిగొచ్చే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.
