Gmail Account Recovery : మీ జీమెయిల్ పాస్వర్డ్ మర్చిపోయారా? జస్ట్ సెల్ఫీ వీడియోతోనే అకౌంట్ రికవరీ.. సింపుల్ ప్రాసెస్!
Gmail Account Recovery : యూజర్లు తమ జీమెయిల్ పాస్‌వర్డ్‌ను ఈజీగా రికవరీ చేసేందుకు గూగుల్ అద్భుతమైన టూల్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక సెల్ఫీ వీడియోతో ఖాతాను తిరిగి పొందవచ్చు..
Gmail Account Recovery
- జీమెయిల్ యూజర్లకు ఇకపై పాస్వర్డ్ రికవరీ చాలా ఈజీ
- సెల్ఫీ వీడియోను అప్లోడ్ చేసి మీ ఖాతా పాస్వర్డ్ రీసెట్ చేయొచ్చు
- ఖాతా రికవరీ కోసం ఏ దారి లేనప్పుడు ఈ ఫీచర్ పనిచేస్తుంది
Gmail Account Recovery : జీమెయిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్ పాస్ వర్డ్ మర్చిపోయారా? లేదంటే జీమెయిల్ సడన్ గా లాక్ అయిందా? డోంట్ వర్రీ.. మీ జీమెయిల్ అకౌంట్ ఎక్కడికి పోదు.. ఇకపై ఈజీగా రికవరీ చేసుకోవచ్చు. ఇలాంటి జీమెయిల్ ఖాతాల కోసం గూగుల్ కంపెనీ కొత్త సెల్ఫీ వీడియో పాస్వర్డ్ రికవరీ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ జీమెయిల్ పాస్‌వర్డ్‌ను ఈజీగా రీసెట్ చేసుకోవచ్చు.
ఈ మేరకు గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో ఇదే విషయాన్ని వివరించింది. యూజర్లు తమ జీమెయిల్ ఖాతా పాస్‌వర్డ్‌ను మర్చిపోయినా లేదా రికవరీ ఖాతాను యాక్సెస్ చేయలేకున్నా ఈ ఫీచర్ సాయంతో ఈజీగా తిరిగి పొందవచ్చు. ఇప్పుడు జీమెయిల్ ఖాతాను ఎలా రికవరీ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సెల్ఫీ వీడియోతో అకౌంట్ రికవరీ :
జీమెయిల్ యూజర్లు తమ అకౌంట్లను ఈజీగా రికవరీ చేసేందుకు ఈ కొత్త సెల్ఫీ వీడియో ఫీచర్ రూపొందించినట్టు గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది. అయితే, గూగుల్ ఈ కొత్త ఫీచర్‌ను కేవలం ఆప్షనల్ రికవరీ టూల్‌గానే ప్రవేశపెట్టింది.
ఇకపై ఎప్పుడైనా మీ గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను మర్చిపోయినా లేదా లాక్ అయిపోయినా ఒక సెల్ఫీ వీడియోను అప్లోడ్ చేసి మీ జీమెయిల్ అకౌంట్‌ను రికవర్ చేసుకోవచ్చు. అయితే, మీరు మీ అకౌంట్‌ను సెటప్ చేసేటప్పుడే ఒక వీడియోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ అకౌంట్ రికవరీ కోసం ఈ సెల్ఫీ వీడియోను ఫేస్ వెరిఫికేషన్‌గా పనిచేస్తుంది.
Read Also : Lava Virat V1 Series : లావా కొత్త ఫోన్లు వచ్చేశాయ్.. విరాట్ V1 సిరీస్ అదుర్స్.. ధర చాలా చీప్ గురూ..!
సెల్ఫీ వీడియోను ఎలా వాడొచ్చంటే? :
ఈ సెల్ఫీ వీడియోను రికవరీ టూల్ కోసం వాడుతారు. ముందుగా మీ గూగుల్ అకౌంటులోకి వెళ్లాలి. ఆప్షనల్ రికవరీ ఆప్షన్ ఎంచుకుని షార్ట్ సెల్ఫీ వీడియోను అప్లోడ్ చేయాలి. మీ అకౌంట్ రికవరీ కోసం మరో దారిలేనప్పుడు మళ్లీ ఒక చిన్న సెల్ఫీ వీడియోను అప్లోడ్ చేయాలి.
అప్పుడు, గూగుల్ సిస్టమ్ ఈ రెండు సెల్ఫీ వీడియోలను విశ్లేషించి మీ ఖాతాను రికవరీ చేస్తుంది. ఆ తర్వాత కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మీ ఖాతాలోకి మళ్లీ లాగిన్ అవ్వొచ్చు. అంతేకాదు.. వాట్సాప్ మాదిరిగానే గూగుల్ కూడా ఇటీవలే జీమెయిల్ కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ తీసుకొచ్చింది.
రిఫరెన్స్ వీడియో కోసం మాత్రమే :
మీ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు లేదా సెటప్ చేసేటప్పుడు అప్లోడ్ చేసిన సెల్ఫీ వీడియోను గూగుల్ సిస్టమ్ రిఫరెన్స్ వీడియోగా వాడొచ్చు. సెల్ఫీ వీడియోను అప్లోడ్ చేసేటప్పుడు వీడియో అప్లోడ్ అవుతున్నట్లు మీ తలను కొంచెం కదపాల్సి ఉంటుంది. అంతేకాదు.. అకౌంట్ రికవరీ సమయంలో మీరు పాత వీడియోను మళ్లీ అప్లోడ్ చేయలేరు. అదే, రియల్ టైమ్‌లో మాత్రం మీ ఫోన్ ఫ్రంట్ కెమెరాను వాడాల్సి ఉంటుంది.
