Gabriel Langton Injury : కామన్వెల్త్ గేమ్స్‌లో భయానక ఘటన.. విన్యాసాల మధ్య కుప్పకూలిన ఇంగ్లండ్ జిమ్నాస్ట్.. వీడియో వైరల్
Gabriel Langton Injury : కామన్వెల్త్ గేమ్స్-2026లో జిమ్నాస్టిక్స్ పోటీల సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుుతంది.
England gymnast takes nasty fall in Commonwealth Games
Gabriel Langton Injury : కామన్వెల్త్ గేమ్స్-2026లో జిమ్నాస్టిక్స్ పోటీల సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌కు చెందిన యువ జిమ్నాస్ట్ గాబ్రియెల్ లాంగ్టన్ పురుషుల జట్టు ఫైనల్లో హైబార్పై విన్యాసాలు చేస్తుండగా పట్టుతప్పి తలకిందులుగా నేలపై పడిపోయాడు. దీంతో పోటీని వెంటనే నిలిపివేసి వైద్య సిబ్బంది అత్యవసర చికిత్స అందించారు. అనంతరం ఆయనను స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తరలించారు.
19 ఏళ్ల లాంగ్టన్ తల, మెడ భాగాలకు గాయాలయ్యాయి. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి తీవ్రమైన గాయాలు లేవని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు టీమ్ ఇంగ్లండ్ ప్రకటించింది. ఈ ప్రమాదం కారణంగా పోటీ కొంతసేపు నిలిచిపోయింది. లాంగ్టన్ ఇటీవలే గాయపడిన ఒలింపిక్ పతక విజేత మ్యాక్స్ విట్లాక్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. ఈ ఘటనతో సహచర ఆటగాళ్లు, ప్రేక్షకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ భయానక ఘటన తరువాత లాంగ్టన్ లేకుండానే పోటీలు పూర్తి చేసిన ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచి వెండి పతకం గెలుచుకోగా, కెనడా, ఆస్ట్రేలియా జట్లు స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాయి. లాంగ్టన్ గాయాలతో పోటీకి దూరమైనప్పటికీ, తన జట్టు సిల్వర్ మెడల్ సాధించడంతో సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తున్నట్లు ఇంగ్లాండ్ టీమ్ తెలిపింది. అయితే, లాంగ్టన్ కిందపడిన భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
🚨NEWS: English gymnast Gabriel Langton has been rushed to hospital after suffering a major fall during the Commonwealth Games pic.twitter.com/bXsMusO5fF
— Basil the Great (@BasilTheGreat) July 25, 2026
