Bigg Boss 5 Telugu : నింద వేసింది.. సారీ చెప్పి హగ్ ఇచ్చింది..

సిరి తన షర్ట్ లోపల సన్నీ చేయి పెట్టాడు అని ఆరోపించడంతో బిగ్ బాస్ స్లో మోషన్ వీడియో ప్లే చేసి చూపించారు..

Bigg Boss 5 Telugu : నింద వేసింది.. సారీ చెప్పి హగ్ ఇచ్చింది..

Siri

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ సీజన్ 5 మంచి రసవత్తరంగా సాగుతోంది. ఫస్ట్ వీక్ సెవన్ ఆర్ట్స్ సరయు ఎలిమినేట్ కాగా.. రెండో వారం నామినేషన్‌లో లోబో, కాజల్, ప్రియాంక సింగ్, ఉమా దేవి, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్ ఉన్నారు.

Bigg Boss 5 Telugu : ఉమా దేవి ఎలిమినేషన్‌..! కారణం ఏంటంటే..?

ఇదిలా ఉంటే నిన్నటి ఎపిసోడ్‌లో సిరి షర్ట్ లోపల చెయ్యి పెట్టిన ఘటనకు సంబంధించిన సీక్రెట్స్ రివీల్ చేశారు హోస్ట్ నాగార్జున. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్‌కి ఓ టాస్క్ ఇచ్చారు. అందులో భాగంగా సన్నీ.. తన షర్ట్ లోపల చేయి పెట్టాడంటూ రచ్చ రచ్చ చేసింది సిరి.. అందరూ సిరి చెప్పింది నిజమేనని అనుకున్నారు.

Bb 5

 

కట్ చేస్తే.. నాగ్.. సన్నీ నీ షర్ట్ లోపల చేయి పెట్టాడా అని సిరిని అడిగ్గా అవునని చెప్పింది. క్లారిటీ కోసం షణ్ముఖ్‌ని అడిగితే అతను కూడా సిరి చెప్పింది నిజమేనని చెప్పడంతో.. స్లో మోషన్ వీడియో ప్లే చేసి చూపించారు బిగ్ బాస్.. ఆ వీడియోలో సిరి షర్ట్ లోపల చేయి పెట్టింది శ్వేత వర్మ అని తెలిసింది. దీంతో డౌట్ క్లియర్ అయింది.

Evaru Meelo Koteeswarulu : తారక్ షో కి గెస్ట్‌గా మహేష్ బాబు..

సన్నీ కూల్ అయ్యాడు. సిరి అతనికి సారీ చెప్పి హగ్ ఇచ్చింది. ఇంకెప్పుడూ నిజం తెలుసుకోకుండా ఎదుటి వారి క్యారెక్టర్‌ని బ్యాడ్ చెయ్యొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇక లోబో, అనీ మాస్టర్, ప్రియాంక సింగ్‌లను హోస్ట్ నాగార్జున సేవ్ చేశారు. దీంతో మిగతా ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss 5 Telugu : ఏకంగా నలుగుర్ని సెట్ చేసుకున్న శ్రీరామ చంద్ర.. పనిమనిషిగా కాజల్..