The Ghost: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ది ఘోస్ట్’

అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’ చిత్ర యూనిట్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్ పాల్గొంది...

The Ghost: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ది ఘోస్ట్’
ad

The Ghost: అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’ చిత్ర యూనిట్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్ పాల్గొంది. కాగా, ఈ సినిమా నుండి నాగ్ పాత్రకు సంబంధించిన ఎలక్ట్రిఫయింగ్ వీడియోను ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. చేతిలో కత్తి పట్టుకుని ఎదురుగా వస్తున్న శత్రువులను నాగ్ చాలా స్టైలిష్‌గా చంపేస్తాడు. ఇక ఈ సినిమా స్టేటస్ గురించి చిత్ర యూనిట్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

The Ghost: కిల్లింగ్ మెషిన్‌గా రాబోతున్న నాగ్.. ఎప్పుడంటే..?

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉందని, పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని వారు తెలిపారు. ఇక ఈ సినిమాలో ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్రలో నాగ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడని, ఆయన అభిమానులకు ఇది ఖచ్చితంగా నచ్చుతుందని దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెలిపారు. గుంటూరు టాకీస్, గరుడవేగ చిత్రాలను తాను చూశానని, అందులో ప్రవీణ్ సత్తారు యాక్షన్ టేకింగ్ అద్భుతంగా ఉండటంతో, ఈ సినిమా చేసేందుకు తాను ఒప్పుకున్నానని నాగ్ అన్నారు.

Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్‌డేట్‌తో వస్తున్న ‘ది ఘోస్ట్’!

ఈ సినిమాలో హీరోయిన్‌గా సోనాల్ చౌహాన్ నటిస్తుందని, ఆమె కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను అద్భుతం చేస్తుందని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే కిల్లింగ్ మెషిన్‌గా నాగ్ పాత్రకు సంబంధించిన వీడియో టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాను అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.