Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్‌డేట్‌తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. నాగ్ నుండి సినిమా వచ్చి చాలా రోజులు....

Nagarjuna The Ghost Electrifying Update On July 7
Nagarjuna: అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. నాగ్ నుండి సినిమా వచ్చి చాలా రోజులు అవుతుండటంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవాలని అక్కినేని అభిమానులు కోరుతున్నారు. ఇక ఈ సినిమాను డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.
Nagarjuna : నాగార్జున ‘ఘోస్ట్’ మూవీ మేకింగ్
అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, తాజాగా ఈ సినిమా నుండి ఓ అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్ర యూనిట్. ది ఘోస్ట్ సినిమా నుండి ఓ ఎలక్ట్రిఫైయింగ్ అప్‌డేట్‌ను రేపు ఉదయం 11 గంటలకు ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా నుండి రాబోయే అప్‌డేట్ ఏమిటా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ లేదా టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్ అయి ఉండవచ్చని వారు అంటున్నారు.
ఇక ఈ సినిమాలో నాగ్ పాత్ర చాలా విలక్షణంగా ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అర్థమవుతోంది. మరి రేపు నాగ్ ఎలాంటి అప్‌డేట్‌తో అభిమానుల ముందుకు వస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో అందాల భామ సోనల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నారాయణ్ దాస్ కే నారంగ్, రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
#TheGHOST ? is now ready for the ACTION ?
An Electrifying Update Loading tomorrow at 11:00 AM ⏳
Stay Tuned ??@iamnagarjuna @sonalchauhan7 @PraveenSattaru @AsianSuniel #NarayanDasNarang #RamMohanRao @sharrath_marar @SVCLLP @nseplofficial @AnnapurnaStdios
— Praveen Sattaru (@PraveenSattaru) July 6, 2022