Namratha Shirodkar : ఎప్పుడూ మిస్ అవ్వం.. మామయ్య గారు.. కృష్ణపై ఎమోషనల్ పోస్ట్ చేసిన నమ్రత..

ఇప్పటికి కూడా మహేష్ ఫ్యామిలీ కృష్ణతో, ఆయన ఉండే ఇంట్లో ఒక్క రోజైన గడుపుతారు. తాజాగా ఈ విషయాన్ని నమ్రత సోషల్‌ మీడియా ద్వారా తెలుపుతూ కృష్ణతో మహేష్ పిల్లలు దిగిన ఫోటోని షేర్ చేసింది.

Namratha Shirodkar : ఎప్పుడూ మిస్ అవ్వం.. మామయ్య గారు.. కృష్ణపై ఎమోషనల్ పోస్ట్ చేసిన నమ్రత..

Krishna

Mahesh Babu : సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఫ్యామిలీకి చాలా సమయం కేటాయిస్తారు. మహేష్ షూటింగ్ లేకపోతే ఆ సమయాన్నంతా తన ఫ్యామిలీకి కేటాయిస్తారు. ఇక మహేష్ కుదిరినప్పుడల్లా విదేశాలకు తన ఫ్యామిలీతో కలిసి విహార యాత్రలు చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఫ్యామిలీకి సమయం కేటాయించాలని తన తండ్రి కృష్ణ దగ్గరే నేర్చుకున్నాను అని చాలా సార్లు మహేష్ ఇంటర్వ్యూలలో తెలిపారు.

అయితే ఇప్పటికి కూడా మహేష్ ఫ్యామిలీ కృష్ణతో, ఆయన ఉండే ఇంట్లో ఒక్క రోజైన గడుపుతారు. తాజాగా ఈ విషయాన్ని నమ్రత సోషల్‌ మీడియా ద్వారా తెలుపుతూ కృష్ణతో మహేష్ పిల్లలు దిగిన ఫోటోని షేర్ చేసింది. సూపర్ స్టార్ కృష్ణ, సితార, గౌతమ్ ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ..”మండే లంచ్.. ఎప్పుడూ మిస్ అవ్వం.. ఎన్నో కథలు చెబుతుంటారు.. ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.. మేం అంతా కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం మామయ్య గారు” అంటూ పోస్ట్ చేసింది నమ్రత.

Movie Ticket Rates : భారీ బడ్జెట్ సినిమాల టికెట్ రేట్లు పెంచుతాం.. కానీ.. కండిషన్లు పెట్టిన ఏపీ ప్రభుత్వం

దీనిబట్టి మహేష్ ఫ్యామిలీ కచ్చితంగా వారంలో ఒకరోజు కృష్ణ గారితో కలిసి లంచ్ చేస్తుందని, ఆయనతో కలిసి కొంత సమయాన్ని గడుపుతారని తెలుస్తుంది. మొత్తానికి లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి టైం కేటాయించాలి అంటూ కృష్ణ, మహేష్ చెప్పకనే చెబుతున్నారు.