Movie Ticket Rates : భారీ బడ్జెట్ సినిమాల టికెట్ రేట్లు పెంచుతాం.. కానీ.. కండిషన్లు పెట్టిన ఏపీ ప్రభుత్వం

సినీ పరిశ్రమ అడిగిన రిక్వెస్టులలో భారీ బడ్జెట్ సినిమాలకి రిలీజ్ అయిన మొదటి రెండు వారాలు టికెట్ రేటు పెంచడం కూడా ఒకటి. అయితే ఏపీ ప్రభుత్వం దీనిపై కూడా స్పందించింది. కొత్తగా.........

Movie Ticket Rates : భారీ బడ్జెట్ సినిమాల టికెట్ రేట్లు పెంచుతాం.. కానీ.. కండిషన్లు పెట్టిన ఏపీ ప్రభుత్వం

Movie

Movie Ticket Rates :  ఏపీలో గత కొన్ని నెలల నుంచి సాగిన సినిమా టికెట్ల వివాదం నిన్నటితో ఓ కొలిక్కి వచ్చింది. గతంలో తగ్గించిన సినిమా టికెట్లను ఓ మోస్తరుగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం కొత్త జీవోని విడుదల చేసింది. చిరంజీవితో సహా పరిశ్రమకి చెందిన అనేక పెద్దలు ఏపీ ముఖ్యమంత్రి జగన్, మంత్రి పేర్ని నానితో కలిసి అనేక సార్లు సమస్యలు వివరించారు. అనేక మీటింగ్స్ తర్వాత ఏపీ ప్రభుత్వం ఈ కొత్త జీవోని విడుదల చేసింది. దీంతో సినీ ప్రముఖులంతా ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

అయితే సినీ పరిశ్రమ అడిగిన రిక్వెస్టులలో భారీ బడ్జెట్ సినిమాలకి రిలీజ్ అయిన మొదటి రెండు వారాలు టికెట్ రేటు పెంచడం కూడా ఒకటి. అయితే ఏపీ ప్రభుత్వం దీనిపై కూడా స్పందించింది. కొత్తగా ఇచ్చిన జీవోలో భారీ బడ్జెట్ సినిమాలకి కూడా మొదటి 10 రోజులు టికెట్ రేట్లు పెంచుతాం అంటూ తెలిపింది. కానీ కొన్ని కండిషన్స్ ని కూడా పెట్టి మెలిక వేసింది ఏపీ ప్రభుత్వం.

Womens Day : హ్యాపీ ఫూల్స్ డే అంటూ అనసూయ పోస్ట్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

100 కోట్ల బడ్జెట్ దాటే సినిమాలకి మొదటి 10 రోజులు టికెట్ రేట్లని పెంచుకునే వెసలుబాటు కల్పిస్తాము కానీ ఆ 100 కోట్లు హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా ఉండాలి అని తెలిపింది. సాధారణంగా చూసుకుంటే ఈ ముగ్గురు రెమ్యునరేషన్ కలిపి దాదాపు 30 శాతం ఉంటుంది సినిమా బడ్జెట్ లో. అప్పుడు టికెట్ రేటు పెంచుకునే అవకాశం ఉండదు.

Natti Kumar : సినిమా టికెట్ రేట్లపై ఇచ్చిన జీవోలో మరిన్ని సవరణలు కావాలి..

అంతే కాక 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ కలిగిన సినిమాల టికెట్ రేట్లు మొదటి 10 రోజులు పెంచాలంటే ఆ సినిమా కనీసం 20 శాతం అయినా ఏపీలో షూటింగ్ చేసి ఉండాలి అని తెలిపారు. ఈ లెక్కన రాబోయే సినిమాలు ఏపీలో కూడా షూటింగ్ జరిగేలా చూసుకోవాలి. ఇలా కండిషన్స్ పెట్టి ఇవ్వడంతో దీనిపై కొంతమంది సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.