Balakrishna : టైసన్ కోసం బాలయ్య..!

‘లైగర్’ కోసం బాలయ్యను రంగంలోకి దింపిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్..

Balakrishna : టైసన్ కోసం బాలయ్య..!

Bala

Balakrishna: నటసింహా నందమూరి బాలకృష్ణ వయసు పెరిగే కొద్ది మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. డిఫరెంట్ గెటప్స్, అంతే డిఫరెంట్ కథలు, క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న ‘అఖండ’ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది.

Ram Pothineni : రామ్ పోతినేని మెడకు గాయం

తర్వాత యంగ్ డైరెక్టర్స్ గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌లతో సినిమాలు లైన్‌లో పెట్టేసాడు. పూరి – బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన ‘పైసా వసూల్’ క్రేజీ సినిమాగా నిలిచింది. ఈసారి అంతకుమించి అనేలా బాలయ్యను చూపించబోతున్నాడట పూరి.

Vidyu Raman : మాల్దీవుల్లో రచ్చ చేసిన లేడీ కమెడియన్..

ఇదిలా ఉంటే ఆ సినిమా కంటే ముందే బాలయ్య, పూరి డైరెక్ట్ చేస్తున్న మరో సినిమాకి పని చెయ్యబోతున్నాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ – పూరి కలయికలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Stylish Villains : సూపర్ విలన్స్..!

‘లైగర్’ లో వరల్డ్ ఫేమస్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ క్యారెక్టర్‌కి తెలుగులో బాలయ్య బాబు చేత డబ్బింగ్ చెప్పించబోతున్నారట. ఇంతకుముందు నందమూరి తారక రత్న నటించిన ‘యువరత్న’ సినిమాకి వాయిస్ ఓవర్ చెప్పాడు బాలయ్య.. బాలయ్య సినీ కెరీర్‌లో ఫస్ట్ టైం పాట పాడించిన క్రెడిట్ పూరీదే. ఇప్పుడు మరోసారి తన సినిమాకి బాలయ్య చేత డబ్బింగ్ చెప్పించబోతున్నాడు పూరి.

Mike Tyson : ‘లైగర్’ కోసం బాక్సింగ్ లెజెండ్..