Nandamuri Balakrishna : ‘ఆహా’ లో బాలయ్య అదిరిపోయే టాక్ షో..!

నటసింహం నందమూరి బాలకృష్ణ.. తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ కోసం ఓ స్పెషల్ టాక్ షో చెయ్యనున్నారు..

Nandamuri Balakrishna : ‘ఆహా’ లో బాలయ్య అదిరిపోయే టాక్ షో..!

Aha Balakrishna

Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ స్పీడ్‌లో సినిమాలు లైనప్ చేస్తున్నారు. రీసెంట్‌గా ‘అఖండ’ షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేసాడు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య – బోయపాటి కలయికలో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.

Annaatthe : రజినీ కోసం బాలు పాడిన చివరి సాంగ్ ఇదే..

తర్వాత యంగ్ డైరెక్టర్స్ గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌లతో సినిమాలు లైన్‌లో పెట్టేసాడు. పూరి – విజయ్ దేవరకొండల ‘లైగర్’ లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌కి బాలయ్య తెలుగులో వాయిస్ చెప్పబోతున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి.

ChaySam : నాగ చైతన్యను గ్రూపులో యాడ్ చేసిన ప్రభాస్

కట్ చేస్తే.. ఇప్పుడో క్రేజీ అప్‌డేట్ ఫిలిం అండ్ మీడియా సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. బ్లాక్‌బస్టర్ సినిమాలు, అదిరిపోయే సిరీస్, అలరించే టాక్ షోలతో తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందిస్తూ.. 100 శాతం తెలుగు ఓటీటీగా డిజిటల్ రంగంలో చెరుగని ముద్ర వేసింది ‘ఆహా’..

Balakrishna : టైసన్ కోసం బాలయ్య..!

ఈ పాపులర్ ఓటీటీ నటసింహంతో ఓ స్పెషల్ టాక్ షో ప్లాన్ చేస్తోంది. ఫస్ట్ టైం బాలయ్య హోస్టింగ్ చెయ్యబోతున్నాడు. టాలీవుడ్‌తో ఇతర భాషలకు చెందిన సెలబ్రిటీలతో ఇప్పటికే పెద్ద లిస్ట్ రెడీ చేసారట ‘ఆహా’ టీం. బాలయ్య స్టైల్లో ఎనర్జిటిక్‌గా సాగే ఈ టాక్ షోకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అతి త్వరలో రానుంది.

Srivalli Song : ‘శ్రీవల్లి’ సాంగ్ వచ్చేస్తోంది..