Devil : డెవిల్ గ్లింప్స్ రిలీజ్.. నందమూరి అభిమానులకు కళ్యాణ్ రామ్ బర్త్‌డే గిఫ్ట్..

తాజాగా నేడు నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా డెవిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ గ్లింప్స్ ఆసక్తిగా సాగింది.

Devil : డెవిల్ గ్లింప్స్ రిలీజ్.. నందమూరి అభిమానులకు కళ్యాణ్ రామ్ బర్త్‌డే గిఫ్ట్..

Nandamuri Kalyan Ram Devil Glimpse Released

Devil Glimpse :  నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇటీవల బింబిసార సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అలాగే వరుస సినిమాలని లైన్ లో పెట్టారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ అనే సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా బ్రిటిష్ కాలంలో ఉండే సీక్రెట్ ఏజెంట్ కథ అని సమాచారం. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా నవీన్ అనే కొత్త దర్శకుడు అభిషేక్ నమ నిర్మాతగా అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.

Pawan Kalyan : టాలీవుడ్‌లో అత్యంత వేగంగా ఇన్‌స్టాగ్రామ్ 1 మిలియన్ ఫాలోవర్స్ తెచ్చుకున్న హీరోగా పవర్ స్టార్ రికార్డ్..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కళ్యాణ్ రామ్ కి సంబంధించి ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. తాజాగా నేడు నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా డెవిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ గ్లింప్స్ ఆసక్తిగా సాగింది. బ్రిటిష్ కాలంలో ఉండే ఓ ఇండియన్ ఏజెంట్ లా కళ్యాణ్ రామ్ కనిపించారు. ఫైటింగ్స్, మాస్ ఎలివేషన్స్, లవ్ సీన్స్.. ఈ సినిమాలో అన్ని ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నందమూరి అభిమానులు ఈ గ్లింప్స్ ని షేర్ చేస్తూ కళ్యాణ్ రామ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.