SSMB28 : త్రివిక్రమ్ – మహేష్ సినిమాలో నందమూరి హీరో.. మళ్ళీ విలన్‌గా..

త్రివిక్రమ్ మహేష్ సినిమాలో ప్రతినాయకుడిగా నందమూరి హీరో తారకరత్నని తీసుకోబోతున్నట్టు సమాచారం. దీనిపై హింట్ ఇస్తూ తన ట్విట్టర్ లో తారకరత్న.........

SSMB28 : త్రివిక్రమ్ – మహేష్ సినిమాలో నందమూరి హీరో.. మళ్ళీ విలన్‌గా..

Mahesh Babu

SSMB28 :  సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే ‘సర్కారు వారి పాట’ సినిమాతో వచ్చి భారీ విజయం సాధించాడు. ప్రస్తుతం ఫారెన్ ట్రిప్ కి వెళ్లి ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ పూర్తయి వచ్చిన తర్వాత SSMB28 ప్రాజెక్టుని మొదలు పెట్టనున్నారు మహేష్. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. జూన్ లేదా జులై నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే పూజా కార్యక్రమాలని కూడా పూర్తిచేసుకుంది ఈ సినిమా. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించబోతుంది.

 

ఇటీవల ఈ సినిమాకి ‘అర్జునుడు’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాకి సెకండ్ హీరోయిన్ గా కూడా మరొకరిని తీసుకోనున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రపై వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ మహేష్ సినిమాలో ప్రతినాయకుడిగా నందమూరి హీరో తారకరత్నని తీసుకోబోతున్నట్టు సమాచారం.

సీనియర్ ఎన్టీఆర్‌ ఎక్కువగా ఏ ఫుడ్ తింటారో తెలుసా??

నందమూరి తారకరత్న గతంలో హీరోగా చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పలు సినిమాల్లో విలన్ గా కూడా మెప్పించాడు. తారకరత్న మరోసారి విలన్ గా మారనున్నారు. దీనిపై హింట్ ఇస్తూ తన ట్విట్టర్ లో తారకరత్న SSMB28 అని ఒక ఇంజక్షన్, విలన్ సింబల్ పోస్ట్ చేశాడు. దీంతో తారకరత్న ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నారని మరింత క్లారిటీ వచ్చింది. మహేష్ తో తారకరత్న త్రివిక్రమ్ సినిమాలో తలపడనున్నట్టు తెలిసి నందమూరి, ఘట్టమనేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. ఇక మహేష్ అభిమానులతో పాటు నందమూరి అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.