Ramarao On Duty : ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్లు ఒకే స్టేజిపై.. రవితేజ కోసం నాని..

'రామారావు ఆన్ డ్యూటీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 24 ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి న్యాచురల్ స్టార్ నాని గెస్ట్ గా రాబోతున్నాడు.

Ramarao On Duty : ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్లు ఒకే స్టేజిపై.. రవితేజ కోసం నాని..

Nani

Raviteja – Nani :  తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి ఎదిగిన వాళ్ళ పేర్లు చెప్పమంటే చిరంజీవి తర్వాత ఎవరైనా సరే రవితేజ, నాని పేర్లే చెప్తారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయాణం మొదలు పెట్టి స్టార్ హీరోలుగా మారారు ఇద్దరూ. ఒకరు మాస్ మహారాజ్ గా మారితే మరొకరు న్యాచురల్ స్టార్ గా మారారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు స్టేజిపైన కనపడలేదు. ఇలాంటి సెల్ఫ్ మేడ్ స్టార్ హీరోలు ఒకేసారి స్టేజిపైన కనిపిస్తే ఆ కిక్కే వేరు.

రవితేజ హీరోగా రాబోతున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోసారి మాస్ క్యారెక్టర్ లో రవితేజ మెరిపించనున్నాడు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 24 ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి న్యాచురల్ స్టార్ నాని గెస్ట్ గా రాబోతున్నాడు.

Jonnavittula Ramalingeswara Rao : ఎన్నో పాటలు రాశాను.. కానీ అవార్డులు మాత్రం రాలేదు..

నాని రవితేజ కోసం వస్తుండటంతో ఈ ఈవెంట్ కోసం, వాళ్ళిద్దర్నీ ఒకే స్టేజిపైన చూడటం కోసం అభిమానులు, సినీ ప్రేముకులు ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్ లో ఎన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయో అని భావిస్తున్నారు ప్రేక్షకులు.