Jonnavittula Ramalingeswara Rao : ఎన్నో పాటలు రాశాను.. కానీ అవార్డులు మాత్రం రాలేదు..

ఎంతో టాలెంట్‌ ఉన్న జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు చాలా సినిమాలకి పాటలు రాశారు. ముఖ్యంగా భక్తి పాటలు. ఆయన రాసిన ఎన్నో భక్తి పాటలు ఇప్పటికి ప్రతి రోజూ గుళ్ళలో వినిపిస్తాయి. తాజాగా జొన్నవిత్తుల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...........

Jonnavittula Ramalingeswara Rao : ఎన్నో పాటలు రాశాను.. కానీ అవార్డులు మాత్రం రాలేదు..

Jonnavittula

Jonnavittula : కళలు, సినిమాల్లో ఉండేవారు డబ్బుల కంటే కూడా అవార్డులనే కోరుకుంటారు. వాటితో తమకి మరింత గుర్తింపు వస్తుందని భావిస్తారు. కొన్ని సార్లు కొంతమందిని గుర్తించకపోవడం, అవార్డులు రాకపోవడం జరుగుతూ ఉంటాయి. అయితే చాలా మంది అవార్డు వస్తుంది అనుకున్నా రాకపోతే తర్వాత ఇంకా ట్రై చేయొచ్చు అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం అవార్డు రాలేదు, చాలా కష్టపడ్డాను అంటూ వారి అసహనాన్ని మీడియా ముందే చెప్పేస్తారు. తాజాగా ప్రముఖ పాటల రచయిత, భక్తి పాటలు, పేరడీ పాటల స్పెషలిస్ట్ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఎంత కష్టపడినా తనకి అవార్డులు రాలేదంటూ వాపోయారు.

VN Aditya : మన తప్పుల వల్లే తెలుగు సినిమాలకి నేషనల్ అవార్డులు ఎక్కువగా రావట్లేదు

ఎంతో టాలెంట్‌ ఉన్న జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు చాలా సినిమాలకి పాటలు రాశారు. ముఖ్యంగా భక్తి పాటలు. ఆయన రాసిన ఎన్నో భక్తి పాటలు ఇప్పటికి ప్రతి రోజూ గుళ్ళలో వినిపిస్తాయి. తాజాగా జొన్నవిత్తుల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”వేటూరి, సిరివెన్నెల సినిమా పరిశ్రమని ఏలుతున్న సమయంలో రాఘవేంద్రరావు నాకో సినిమా ఇచ్చి మొత్తం పాటలు నన్నే రాయమన్నారు. ఆయన నాకు అంత మహా ఉపకారం చేశారు. దేవుడి పాటలు ఎక్కువ రాసే నేను విక్రమార్కుడిలో జింతాత జిత జితా.. లాంటి పాటలు కూడా రాశాను. తిట్ల మీద కూడా పాట రాశాను. నేను ఎన్నో వందల పాటలు రాశాను. ప్రతి ఛానల్‌లో, ప్రతి గుడిలో అందరి బంధువయ, జగదానందకార, మహా కనకదుర్గ, జయజయ శుభకర వినాయక, అయ్యప్ప దేవాయ నమహ… లాంటి నేను రాసిన పాటలు మార్మోగుతూనే ఉంటాయి. అది నాకు చాలా సంతోషాన్నిచ్చే విషయమే. కానీ ఇన్ని గొప్ప పాటలు రాసినా నాకింతవరకు ఏ అవార్డూ రాలేదు, అది చాలా బాధాకరం” అని తెలిపారు.