Nani : పుష్పకి, బాలీవుడ్‌కి సంబంధమే లేదు.. మన సినిమాని మనం పాన్ ఇండియా సినిమా అనుకోకూడదు..

పాన్ ఇండియా సినిమాలపై నాని మాట్లాడుతూ.. ''నా ఉద్దేశంలో మన సినిమాని మనమే పాన్‌ ఇండియా సినిమా అనుకోకూడదు. ప్రేక్షకులు స్వీకరిస్తేనే అది.......

Nani : పుష్పకి, బాలీవుడ్‌కి సంబంధమే లేదు.. మన సినిమాని మనం పాన్ ఇండియా సినిమా అనుకోకూడదు..

Nani

Nani :  ఇటీవల పాన్ ఇండియా సినిమాలు, సౌత్, బాలీవుడ్ అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. సినిమా వర్గాలు కూడా ఇవే టాపిక్స్ మీద మాట్లాడుతున్నాయి. సెలబ్రిటీలు ఎక్కడైనా ఇంటర్వ్యూలు ఇచ్చినా ఇవే టాపిక్స్ మీద మాట్లాడుతున్నారు. తాజాగా అంటే సుందరానికి ప్రమోషన్స్ లో భాగంగా హీరో నాని ఇంటర్వ్యూలు ఇస్తుండగా నాని కూడా ఇవే టాపిక్స్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Salman Khan : బట్టలు కొనుక్కోడానికి కూడా డబ్బులు ఉండేవి కావు.. ఆయన నాకు దేవుడి లాంటి వాడు..

పాన్ ఇండియా సినిమాలపై నాని మాట్లాడుతూ.. ”నా ఉద్దేశంలో మన సినిమాని మనమే పాన్‌ ఇండియా సినిమా అనుకోకూడదు. ప్రేక్షకులు స్వీకరిస్తేనే అది పాన్‌ ఇండియా సినిమా. కథ బాగుండి, మంచిగా తెరకెక్కించాలి, అది ప్రజలకి నచ్చాలి. అంతే కానీ యూనివర్సల్‌ కథలతో తీస్తే అది పాన్‌ ఇండియా సినిమా అయిపోదు. పుష్ప సినిమానే తీసుకుంటే ఇక్కడ మన నల్లమల అడవుల్లో జరిగే కథ. దానికి, బాలీవుడ్ కి ఏమైనా సంబంధం ఉందా? కానీ మంచి సినిమా, బాగా తెరకెక్కించారు కాబట్టి అక్కడి ప్రేక్షకులు కూడా ఆదరించడంతో అది పాన్ ఇండియా సినిమా అయింది. ప్రస్తుతం సినీ పరిశ్రమకి బంగారు దశ నడుస్తుంది. సినిమా బాగుంటే ప్రాంతాలు, భాషలతో సంబంధం లేకుండా విజయం సాధిస్తున్నాయి. మన తెలుగు సినిమాకే కాదు, భారతీయ సినిమా పరిశ్రమకే మంచి రోజులు నడుస్తున్నాయి” అని అన్నారు.