Salman Khan : బట్టలు కొనుక్కోడానికి కూడా డబ్బులు ఉండేవి కావు.. ఆయన నాకు దేవుడి లాంటి వాడు..

సల్మాన్ ఖాన్ సునీల్ శెట్టి గురించి మాట్లాడుతూ.. ''సునీల్‌శెట్టి నాకు అన్నయ్య లాంటి వారు. నాకు ఆయనంటే చాలా అభిమానం. నేను సినిమాల్లో ట్రై చేస్తున్న కొత్తలో.............

Salman Khan : బట్టలు కొనుక్కోడానికి కూడా డబ్బులు ఉండేవి కావు.. ఆయన నాకు దేవుడి లాంటి వాడు..

Sunil Shetty

Salman Khan :  ఇప్పుడు స్టార్ హోదాని అనుభవిస్తున్న స్టార్ హీరోలంతా ఒకప్పుడు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఒకానొక సమయంలో కెరీర్ లో ఎన్నో బాధలు అనుభవించిన వాళ్ళే. సినిమా కోసం తిండి, నిద్ర, చిన్ని చిన్ని సంతోషాలు అన్ని వదులుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్లలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒకరు. సల్మాన్ ఖాన్ కూడా తన కెరీర్ ఆరంభంలో అనేక కష్టాలు పడ్డారు. తాజాగా దుబాయ్ లో జరిగిన ఐఫా వేడుకల్లో సల్మాన్ ఖాన్ తన కెరీర్ మొదట్లో పడ్డ కష్టాల గురించి, ఆయనకు సహాయం చేసిన వారి గురించి తెలిపాడు.

 

సల్మాన్ ఖాన్ సునీల్ శెట్టి గురించి మాట్లాడుతూ.. ”సునీల్‌శెట్టి నాకు అన్నయ్య లాంటి వారు. నాకు ఆయనంటే చాలా అభిమానం. నేను సినిమాల్లో ట్రై చేస్తున్న కొత్తలో మేమిద్దరం కలిసి బట్టలు కొనడానికి వెళ్ళాము. అప్పుడు అక్కడ ఉన్న ఓ ట్రెండీ జీన్స్, షర్ట్ నాకు బాగా నచ్చాయి. కానీ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఆ సమయంలో చాలా బాధేసింది బట్టలు కొనుక్కోడానికి కూడా డబ్బులు లేవు అని. కానీ నా బాధని సునీల్ అన్నయ్య గుర్తించి ఆ డ్రెస్ ని కొని నాకు బహుమతిగా ఇచ్చాడు. ఇలాంటివి సునీల్ అన్నయ్య నా కోసం చాలా చేసాడు” అని తెలిపాడు.

అలాగే బోనీకపూర్‌ గురించి మాట్లాడుతూ.. ”బోనీకపూర్‌ నా లైఫ్ లో చాలా సహాయం చేశారు. నేను ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు బోనినే పిలిచి నాకు వాంటెడ్‌ సినిమా ఇచ్చారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ నో ఎంట్రీ అనే సినిమా కూడా ఇచ్చారు. అలా నన్ను ఎంతగానో నిలబెట్టారు బాలీవుడ్ లో బోనీజీ” అని అన్నారు.

Sarkaru Vaari Paata: సర్‌ప్రైజ్ ఇస్తోన్న సర్కారు వారి పాట.. ఏమిటంటే?

సల్మాన్ బాలీవుడ్ నిర్మాత రమేష్ తౌరాని గురించి మాట్లాడుతూ..”బాలీవుడ్‌లో నేను దేవుడిగా భావించే వ్యక్తి రమేశ్‌ తౌరానీ. అసలు ఆయన లేకపోతే నా కెరీర్‌ లేదు. మైనే ప్యార్‌ కియా లాంటి సినిమా రిలీజ్ అయ్యాక కూడా నాకు ఆరు నెలల వరకు ఆఫర్స్ లేవు. అప్పుడు మా నాన్న ప్రముఖ నిర్మాత జీపీ సిప్పీతో నేను సినిమా చేస్తున్నట్లు ఓ ఫిల్మ్‌ మ్యాగజైన్‌లో 2000 రూపాయలు ఇచ్చి ఫేక్‌ ప్రకటన చేశారు. అది చూసిన నిర్మాత రమేశ్‌ తౌరానీ సిప్పీ కార్యాలయానికి వెళ్లి ముందుగానే 5 లక్షలిచ్చి ఆ సినిమాలో భాగమవుతాను అన్నారు. అలా ఫత్తర్‌ కే ఫూల్‌‌ సినిమా మొదలైంది” అని చెప్పి తన కెరీర్ మొదటి రోజులని గుర్తు చేస్తుకున్నారు.

Salman Khan