Nani : థియేటర్స్ కలెక్షన్స్ కి మంచి సినిమాలకు సంబంధం లేదు.. డబ్బులు బాగా వస్తేనే హిట్ అయినట్టు కాదు..

దసరా ఇప్పటికే నాలుగు రోజుల్లో 87 కోట్లు గ్రాస్ వసూలు చేసి నాని కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ గా నిలిచింది. తాజాగా దసరా సినిమా సక్సెస్ పై ఇంటర్వ్యూ ఇచ్చిన నాని పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు.

Nani : థియేటర్స్ కలెక్షన్స్ కి మంచి సినిమాలకు సంబంధం లేదు.. డబ్బులు బాగా వస్తేనే హిట్ అయినట్టు కాదు..

Nani comments on Theater collections and Good Movies

Nani :  నాని(Nani), కీర్తి సురేష్(Keerthy Suresh) జంటగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో వచ్చిన దసరా(Dasara) సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపించడం, సినిమా సాంగ్స్ బాగుండటం, ముందు నుంచి సినిమా పై హైప్ ఉండటం, అదిరిపోయిన సినిమా క్లైమాక్స్.. ఇవన్నీ సినిమాకి ప్లస్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. ఇక కలెక్షన్స్ లో కూడా దసరా సినిమా దూసుకుపోతుంది. ఇప్పటికే నాలుగు రోజుల్లో 87 కోట్లు గ్రాస్ వసూలు చేసి నాని కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ గా నిలిచింది. తాజాగా దసరా సినిమా సక్సెస్ పై ఇంటర్వ్యూ ఇచ్చిన నాని పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు.

 

నాని మాట్లాడుతూ.. చాలామంది నాని మంచి సినిమాలు చేస్తాడు అంటూనే మళ్ళీ బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడతారు. సినిమా బాగుంది, నచ్చింది అంటారు. కానీ కలెక్షన్స్ రాలేదని ఫ్లాప్ అంటారు. థియేటర్ కలెక్షన్స్ కి మంచి సినిమాలకు సంబంధం లేదు. జెర్సీ అందరికి నచ్చింది, కానీ దానికి కలెక్షన్స్ రాలేదు. ఎందుకు ఆ సినిమాకి డబ్బులు రాలేదని మళ్ళీ నన్నే అడుగుతారు. నేను మంచి సినిమాలు ఇవ్వాలని అనుకుంటాను. కొత్త కథలు ఇవ్వాలని ఆలోచిస్తాను. సినిమా కలెక్షన్స్ చూసి కేవలం కలెక్షన్స్ వచ్చే సినిమాలే చేయాలని నేను అనుకుంటే అప్పుడు బిజినెస్ మెన్ అవుతాను కానీ నటుడ్ని అవ్వను.

Nani : థియేటర్స్ లో పేపర్లు విసిరేస్తుంటే.. పేపర్లు వేస్ట్ చేస్తున్నారు అన్నాడు నా కొడుకు

ఇండస్ట్రీకి కొత్త డైరెక్టర్స్ చాలా మంది కొత్త కొత్త కథలతో వస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకి మనం ఎలాంటి కథలైనా చేస్తాం అనే ధైర్యం ఇవ్వాలి. మనం కేవలం కలెక్షన్స్ వచ్చే లాంటి సినిమాలే చేస్తే కొత్త డైరెక్టర్స్ రారు. నన్ను జెర్సీ లాంటి సినిమా చేయమని అడిగేవాళ్ళు ఉన్నారు, దసరా లాంటి కమర్షియల్ సినిమా చేయమని అడిగేవాళ్ళు ఉన్నారు. ఇద్దరినీ మెప్పించే సినిమాలు చేస్తాను. ఒకే వర్గానికి ఫిక్స్ అవ్వను. మళ్ళీ ఒక రెండు మూడు మంచి సినిమాల తర్వాత మాస్ కమర్షియల్ సినిమా చేస్తాను అని తెలిపారు.