Nani : థియేటర్స్ లో పేపర్లు విసిరేస్తుంటే.. పేపర్లు వేస్ట్ చేస్తున్నారు అన్నాడు నా కొడుకు

దసరా సినిమా విజయంపై నాని, చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నాని సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. తాజాగా దసరా సినిమా సక్సెస్ పై ఇంటర్వ్యూ ఇచ్చిన నాని అనేక విషయాలని తెలిపాడు.

Nani : థియేటర్స్ లో పేపర్లు విసిరేస్తుంటే.. పేపర్లు వేస్ట్ చేస్తున్నారు అన్నాడు నా కొడుకు

Nani with his Son (Photo:Twitter)

Nani :  నాని(Nani) హీరోగా, కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్ గా, దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) ముఖ్య పాత్రలో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దసరా(Dasara). సినిమా రిలీజయిన మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపించడం, సినిమా సాంగ్స్ బాగుండటం, ముందు నుంచి సినిమా పై హైప్ ఉండటం, అదిరిపోయిన సినిమా క్లైమాక్స్.. ఇవన్నీ సినిమాకి ప్లస్ అయి భారీ విజయం సాధించింది.

ఇక కలెక్షన్స్ లో కూడా దసరా దూసుకుపోతుంది. ఇప్పటికే నాలుగు రోజుల్లో దసరా సినిమా 87 కోట్లు వసూలు చేసి నాని కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ గా నిలిచింది. దసరా సినిమా విజయంపై నాని, చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నాని సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. తాజాగా దసరా సినిమా సక్సెస్ పై ఇంటర్వ్యూ ఇచ్చిన నాని అనేక విషయాలని తెలిపాడు.

Priyanka Chopra : ముంబైలో సిటాడెల్ స్పెషల్ ప్రీమియర్.. హాలీవుడ్ స్టార్స్ తరలి వచ్చిన వేళ..

ఈ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. దసరా సినిమా కథ పరంగా, వసూళ్ల పరంగా నాకు సంతృప్తినిచ్చిదని. ఈ సినిమాకి పనిచేసిన చాలా మందికి ఇది వాళ్ళ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా, ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. సినిమా విడుదలైన తర్వాత అభినందిస్తూ చాలా మెసేజ్ లు వస్తున్నాయి. సినిమా రిలీజ్ మొదటి రోజు మాతో పాటు మొదటిసారి మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళాను. థియేటర్లో ఫ్యాన్స్ పేపర్లు విసిరేస్తుంటే నాన్న.. పేపర్లు వేస్ట్ చేస్తున్నారు అని అంటున్నాడు. వాడి మాటలకు నాకు నవ్వొచ్చింది. థియేటర్స్ లో, అలా మొదటి రోజు సందడిలో వాడు కూడా సినిమాని బాగా ఎంజాయ్ చేశాడు అని తెలిపారు.