NANI : సోషల్ మీడియాలో అన్న మాటలకి నా వైఫ్ 10 సూట్స్ కొని పెట్టింది : నాని

నాని మాట్లాడుతూ.. నేను ఎక్కడికి వెళ్లినా చాలా సింపుల్ గా వెళ్తాను. ఎక్కువగా వైట్, బ్లాక్ షర్ట్స్ వేసుకొని వెళ్తాను. కొంతమంది సోషల్ మీడియాలో నాని ఏంటి ఎప్పుడు అవే డ్రెస్ లు.......

NANI : సోషల్ మీడియాలో అన్న మాటలకి నా వైఫ్ 10 సూట్స్ కొని పెట్టింది : నాని

Nani

NANI :  సినీ పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతగా కస్టపడి పైకి వచ్చిన అతి తక్కువ మందిలో నాని ఒకరు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయాణం మొదలు పెట్టి న్యాచురల్ స్టార్ గా ఎదిగిన నాని ప్రయాణం అందరికి ఇన్స్పిరేషన్ లాంటింది. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నానికి కరోనా వల్ల థియేటర్స్ లేకపోవడంతో తన గత రెండు సినిమాలని ఓటిటిలో రిలీజ్ చేయాల్సివచ్చింది. ఆ రెండు సినిమాలు ఆశించినంత ఫలితం రాలేదు. దీంతో తన నెక్స్ట్ సినిమాని గట్టిగా ప్లాన్ చేసుకొని థియేటర్స్ లోనే రిలీజ్ చేయబోతున్నాడు.

నాని హీరోగా కృతిశెట్టి, సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమాలో నాని రెండు పాత్రలు పోషించడం, అందులో ఒకటి 1970లో పాత్ర అవ్వడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది ప్రేక్షకులకి. ఈ సినిమా డిసెంబర్ 24న దక్షిణాది భాషల్లో రిలీజ్ అవ్వనుంది. తాజాగా నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో నాని మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. అలాగే ఫస్ట్ టైం నాని బయటకి వచ్చినప్పుడు సూట్ వేసుకొచ్చారు. దీనిపై కూడా మాట్లాడారు.

Pushpa : ‘పుష్ప’లో ఇవాళ్టి నుంచి ‘ఆ’ సీన్ తీసేస్తున్నారు..

నాని మాట్లాడుతూ.. నేను ఎక్కడికి వెళ్లినా చాలా సింపుల్ గా వెళ్తాను. ఎక్కువగా వైట్, బ్లాక్ షర్ట్స్ వేసుకొని వెళ్తాను. కొంతమంది సోషల్ మీడియాలో నాని ఏంటి ఎప్పుడు అవే డ్రెస్ లు వేస్తాడు అని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ని నా వైఫ్ చూసి నాకోసం నా భార్య పది సూట్స్‌ కొనిపెట్టింది. అవి కొన్న దగ్గర్నుంచి వేసుకోమని చెప్తూనే ఉంది. కానీ మనం ఏం సాధించామని ఆ సూట్స్ వేసుకోవాలి అని నేను అనుకునే వాడ్ని. నా వైఫ్ కొన్న ఆ సూట్స్ ని అలాగే పక్కన పెట్టేసాను.

కానీ ఇప్పుడు ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా చేసిన తర్వాత ఆ సినిమా అవుట్ ఫుట్ చుసిన తర్వాత ఇప్పుడు నేను సూట్‌ వేసుకోవచ్చు అని ధైర్యం వచ్చి ఈ బ్లేజర్ వేసుకొచ్చాను. ఈ సినిమాతో నాకు సూట్‌ వేసుకునే అర్హత వచ్చిందనుకుంటున్నాను’’ అని నాని అన్నారు.

Bigg Boss 5 : బిగ్‌బాస్‌ ఫినాలేకి క్యూ కడుతున్న సెలబ్రిటీలు