RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై నారా లోకేష్ స్పెషల్ ట్వీట్..

'ఆర్ఆర్ఆర్' పోస్టర్ ని షేర్ చేస్తూ నారా లోకేష్ ట్విట్టర్ లో.. ''ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నాను. సినిమాకు మంచి స్పందన వస్తుండటం ఎంతో.................

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై నారా లోకేష్ స్పెషల్ ట్వీట్..

Rrr Lokesh

Nara Lokesh :  రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మానియా నడుస్తుంది. ఫ్యాన్స్, ప్రేక్షకులు నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే పలు చోట్ల బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి. సెలబ్రిటీలు సినిమాపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా నారా లోకేష్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై స్పెషల్ ట్వీట్ చేశారు.

RRR : పేపర్స్ విసురుతూ థియేటర్లో హంగామా చేసిన ఉపాసన

‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్ ని షేర్ చేస్తూ నారా లోకేష్ ట్విట్టర్ లో.. ”ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నాను. సినిమాకు మంచి స్పందన వస్తుండటం ఎంతో సంతోషాన్నిస్తోంది. గొప్ప సినిమా అనుభూతిని అందించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు నా అభినందనలు. ఆర్ఆర్ఆర్ సృష్టికర్త రాజమౌళి, మిగిలిన తారాగణానికి నా శుభాభినందనలు. ఈ వారం కుటుంబ సమేతంగా సినిమాను తప్పకుండా చూస్తాను. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్” అంటూ ట్వీట్ చేశారు.