Upasana : పేపర్స్ విసురుతూ థియేటర్లో హంగామా చేసిన ఉపాసన

థియేటర్లో సినిమా చూస్తూ అభిమానులతో పాటు ఉపాసన కూడా స్క్రీన్ పై రామ్ చరణ్ సన్నివేశాలు వచ్చినప్పుడు పేపర్లు ఎగురవేస్తూ హంగామా చేసింది. సినిమా చూస్తూ ఫ్యాన్ గర్ల్ లాగా అరుస్తూ......

Upasana : పేపర్స్ విసురుతూ థియేటర్లో హంగామా చేసిన ఉపాసన

Upasana

 

Upasana :  రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మానియా నడుస్తుంది. ఇప్పటికే పలు చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. ఓవర్సీస్ లో కూడా షోలు పడటంతో టాక్ బయటకి వచ్చేసింది. సినిమా చూసిన వారంతా అద్భుతం అంటూ పొగిడేస్తున్నారు. సినిమా అదిరిపోయింది అంటూ ప్రశంసిస్తున్నారు. ఫ్యాన్స్, ప్రేక్షకులు నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.

ఇక మన సెలబ్రిటీలు సైతం థియేటర్స్ కి వెళ్లి బెనిఫిట్ షో చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ టీం కూడా థియేటర్లలో ఫ్యామిలీ, అభిమానులతో కలిసి సినిమా చూశారు. ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి AMB సినిమాస్ లో బెనిఫిట్ షో చూడగా రాజమౌళి, రామ్ చరణ్ భ్రమరాంబ థియేటర్లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూశారు. రామ్ చరణ్ తో పాటు భార్య ఉపాసన, మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా థియేటర్ కి వచ్చారు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’లో హైలెట్స్ ఇవే.. బెనిఫిట్ షో రివ్యూ ఇదే..

ఇక థియేటర్లో సినిమా చూస్తూ అభిమానులతో పాటు ఉపాసన కూడా స్క్రీన్ పై రామ్ చరణ్ సన్నివేశాలు వచ్చినప్పుడు పేపర్లు ఎగురవేస్తూ హంగామా చేసింది. సినిమా చూస్తూ ఫ్యాన్ గర్ల్ లాగా అరుస్తూ, పేపర్లు చింపుతూ, వాటిని గాల్లోకి ఎగరేస్తూ రచ్చ చేసింది ఉపాసన. ఇక కొన్ని పేపర్లు వెనకాల కూర్చున్న చరణ్ పై కూడా విసురుతూ హడావిడి చేసింది. కొంతమంది ఉపాసన పేపర్లు విసురుతూ చేసిన రచ్చని వీడియోలు తీయగా ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.